Ind vs Eng: అందరి దృష్టి రెండో సెమీఫైనల్‌పైనే .. వాతావరణం లేటెస్ట్‌ అప్‌డేట్‌

టీ20 ప్రపంచకప్‌ రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. ఇప్పటివరకు వాతావరణం పొడిగానే ఉన్నప్పటికీ మ్యాచ్‌ ప్రారంభమయ్యే సమయానికి వర్షం కురవొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated : 27 Jun 2024 15:06 IST

గయానా: టీ20 ప్రపంచకప్‌ (T20 Worldcup 2024) సెమీఫైనల్‌-1లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా (SouthAfrica) ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ ఇవాళ రాత్రి 8 గంటలకు (భారత్‌ కాలమానం ప్రకారం) భారత్‌-ఇంగ్లాండ్‌ల మధ్య జరిగే సెమీఫైనల్‌-2పైనే ఉంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం గండం పొంచి ఉండటం మరింత ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివరకు వాతావరణం (Weather Report) పొడిగానే ఉన్నట్లు అక్కడి వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. అయితే, మ్యాచ్‌ ప్రారంభమయ్యేసరికి చిరుజల్లులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తాజాగా వెల్లడించింది. అదీ కాసేపు మాత్రమే ఉంటుందని.. ఆ తర్వాత సజావుగా సాగే అవకాశాలు ఎక్కువేనని పేర్కొంది. 

కాగా, రెండో సెమీఫైనల్‌కు రిజర్వ్‌డే లేనందున క్రికెట్‌ ప్రేమికుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. వర్షం వల్ల ఆలస్యమైతే మ్యాచ్‌ ముగించేందుకు అదనంగా 250 నిమిషాల సమయం కేటాయించనున్నారు. రెండు జట్లూ కనీసం 10 ఓవర్ల చొప్పున ఆడితేనే ఫలితాన్ని ప్రకటిస్తారు. లేనిపక్షంలో మ్యాచ్‌ రద్దవుతుంది. అలా జరిగితే భారత్‌ ఫైనల్‌కు చేరుతుంది. సూపర్‌-8లో భారత్‌ గ్రూప్‌-1లో అగ్రస్థానంలో నిలవడమే కారణం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని