Harbhajan Singh: పన్ను చెల్లింపుదారుల డబ్బు తింటున్నావంటూ ట్రోల్స్‌.. హర్భజన్‌ కౌంటర్‌

Harbhajan Singh: ‘పన్ను చెల్లింపుదారుల డబ్బు తింటున్నావ్‌..’ అంటూ తనపై సోషల్‌ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌కు గట్టిగా సమాధానమిచ్చారు మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌.

Published : 26 Jun 2024 15:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ (Harbhajan Singh) కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, రాజ్యసభ ఎంపీగా ఉన్న భజ్జీ.. క్రీడలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడంపై కొందరు నెటిజన్లు విమర్శలు (Trolls) వ్యక్తం చేశారు. ఆయనపై విద్వేషపూరిత కామెంట్లు చేశారు. వీటికి ఆయన గట్టిగా బదులిచ్చారు. అసలేం జరిగిందంటే..

టీ20 ప్రపంచకప్‌ (T20 Worldcup 2024)లో హర్భజన్‌ సింగ్‌ కామెంట్రీ వినడంతో చెవుల్లో నుంచి రక్తం కారిందంటూ ఇటీవల ఓ నెటిజన్‌ పోస్ట్‌ పెట్టాడు. దీనికి భజ్జీ స్పందిస్తూ కాస్త వ్యంగ్యంగా జవాబిచ్చారు. మాజీ క్రికెటర్‌ పోస్ట్‌కు మరో నెటిజన్‌ రిప్లై ఇస్తూ.. ‘‘రాజ్యసభలో మీరు మాట్లాడినట్లు ఒక్కసారి కూడా మేం వినలేదు. ఉత్త పుణ్యాన పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో జీతం తీసుకుంటున్నారు. మీరు రాజ్యసభను వీడాలి’’ అని రాసుకొచ్చాడు.

బాబ్బాబు.. 2500 డాలర్లు ఇవ్వండి వచ్చేస్తాం: ఈవెంట్లకు హాజరైన పాక్‌ ప్లేయర్లు

దీనిపై హర్భజన్‌ (Harbhajan Singh) తీవ్ర అసహనం వ్యక్తంచేశాడు. ‘‘భాయ్‌.. నా జీతం మొత్తం ఆర్థిక స్థోమత లేని పిల్లలను చదవించడానికే ఉపయోగిస్తున్నా. ఒక్క పైసా నా సొంతానికి వాడుకోవట్లేదు. నేను కూడా మీలాగే పన్ను చెల్లింపుదారుడినే. మీరు కూడా చదువుకోవాలంటే చెప్పండి నేను సాయం చేస్తా..! మీరు కొంచెం మర్యాద నేర్చుకోవాలి’’ అని ఈ ఆప్‌ ఎంపీ ఘాటుగా బదులిచ్చారు. గతంలో ఐపీఎల్ టోర్నీ సమయంలోనూ భజ్జీపై విమర్శలు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని