Team India: ప్రధాని నరేంద్ర మోదీతో ముగిసిన భారత క్రికెటర్ల భేటీ

వరల్డ్‌ కప్‌తో స్వదేశానికి చేరిన భారత క్రికెటర్లకు అపూర్వ ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Updated : 04 Jul 2024 13:24 IST

ఇంటర్నెట్ డెస్క్: విండీస్-అమెరికా సంయుక్త ఆతిథ్యంగా జరిగిన పొట్టి కప్‌ను సొంతం చేసుకున్న టీమ్‌ఇండియా గురువారం ఉదయం స్వదేశానికి చేరుకుంది. ఈసందర్భంగా వారికి అపూర్వ స్వాగతం లభించింది. భారత జట్టు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయింది. ప్రధానితో కలిసి ఆటగాళ్లంతా అల్పాహారం చేశారు. ఈసందర్భంగా ప్రతీ క్రికెటర్‌ను మోదీ ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలిపారు. అనంతరం ప్రధాని నివాసం నుంచి వారు ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. భారత క్రికెటర్లు నేరుగా ముంబయికి వెళ్తారు. సాయంత్రం 5 గంటలకు రోడ్‌షో, అనంతరం వాంఖడే వేదికగా సన్మానం జరగనుంది.

ఫైనల్‌ రోజున మోదీ స్వయంగా ఫోన్‌ చేసి ప్లేయర్లతో మాట్లాడిన సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా వరల్డ్‌ కప్‌ (World Cup) నెగ్గింది. చివరిగా ఎంఎస్ ధోనీ నాయకత్వంలో వన్డే ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ను దక్కించుకోవడానికి 17 ఏళ్లు పట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని