T20 World Cup: రోహిత్‌తో ఓపెనింగ్‌ చేసేదెవరు..? అతడైతే బెస్ట్‌ : సునీల్‌ గావస్కర్‌

టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మతో కలిసి ఎవరు ఓపెనింగ్‌ చేయాలనే దానిపై సునీల్‌ గావస్కర్‌ స్పందించాడు.

Published : 03 Jun 2024 00:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ సంగ్రామం ప్రారంభమైంది. వార్మప్‌ మ్యాచ్‌లో బంగ్లాపై టీమ్‌ఇండియా అదరగొట్టింది. చక్కటి ప్రాక్టీస్‌తో పాటు.. జట్టు కూర్పుపై స్పష్టత వచ్చేందుకు ఈ మ్యాచ్‌ ఉపయోగపడిందని కెప్టెన్ రోహిత్ కూడా వెల్లడించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మతో ఓపెనింగ్‌ జోడీగా జైస్వాల్‌ కాకుండా.. సంజూ శాంసన్‌ బరిలోకి దిగాడు. దీంతో ఓపెనింగ్‌ పార్ట్‌నర్‌గా జైస్వాల్‌ మొదటి ఎంపిక కాదని మేనేజ్‌మెంట్‌ భావిస్తోందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇదే విషయంపై మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ స్పందించాడు.

రోహిత్‌తో కలిసి కోహ్లీ ఓపెనింగ్‌ చేయాలని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. జైస్వాల్‌ అంత మంచి ఫామ్‌లో లేనందున ఇదే సరైన నిర్ణయమని పేర్కొన్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో విరాట్‌ అద్భుత ప్రదర్శన చేసి.. టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

‘ఐపీఎల్‌లో విరాట్‌ ఫామ్‌ ఎలా ఉందో చూశాం. ముఖ్యంగా సీజన్‌ రెండో అర్ధ భాగంలో అద్భుతంగా ఆడాడు. అతడు రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌ చేయాలి. లెఫ్ట్‌, రైట్‌ కాంబినేషన్‌లో బ్యాటింగ్‌ చేయాలని టీవీ వేదికల్లో చర్చిస్తుంటాం. అయితే.. ఉత్తమ ఆటగాళ్లు ఎక్కడ ఆడినా మంచి ప్రదర్శనే చేస్తారు. ఇక జైస్వాల్‌ టెస్టు సిరీస్‌ సమయంలోనూ మంచి ఫామ్‌లో లేడు’ అని వార్మప్‌ మ్యాచ్‌ అనంతరం గావస్కర్‌ విశ్లేషించాడు.

ఈ వార్మప్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 60 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. జట్టుతో ఆలస్యంగా కలిసిన విరాట్‌ కోహ్లి ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగలేదు. జూన్‌ 5న రోహిత్‌ సేన ఐర్లాండ్‌తో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. తుది జట్టులో ఎవరుండేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని