T20 World cup: దక్షిణాఫ్రికా మారలేదు..

వన్డేల్లో అయినా, టెస్టుల్లో అయినా ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరిన చరిత్రే లేదు దక్షిణాఫ్రికాకు. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి గురి కావడం వల్లో, దురదృష్టం వెంటాడడం వల్లో ఆ జట్టు నిష్క్రమించడం మామూలే.

Updated : 30 Jun 2024 09:47 IST

న్డేల్లో అయినా, టీ20 అయినా ప్రపంచకప్‌లో మొన్నటి వరకు ఫైనల్‌కు చేరిన చరిత్రే లేదు దక్షిణాఫ్రికాకు. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి గురి కావడం వల్లో, దురదృష్టం వెంటాడడం వల్లో ఆ జట్టు నిష్క్రమించడం మామూలే. అయితే ఈసారి ప్రపంచకప్‌లో మాత్రం నిలకడగా ఆడి ఫైనల్‌ చేరింది సఫారీ జట్టు. సూపర్‌-8లో ఇంగ్లాండ్‌ 6 వికెట్లు చేతిలో ఉండగా 3 ఓవర్లలో 25 పరుగులే చేయాల్సి రాగా.. ఆ స్థితిలో ప్రత్యర్థిని కట్టడి చేసి 7 పరుగుల తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది దక్షిణాఫ్రికా. దీంతో సఫారీ జట్టు మారిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఫైనల్లో 6 వికెట్లు చేతిలో ఉండగా 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో తడబడి మ్యాచ్‌ను భారత్‌కు అప్పగించేసింది సఫారీ జట్టు. దీంతో దక్షిణాఫ్రికా మారలేదని.. మంచి స్థితి నుంచి తడబడి కుప్పకూలే బలహీనతను విడిచిపెట్టలేదని మరోసారి రుజువైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని