Sania Mirza-Shami: షమీతో సానియా పెళ్లి వార్తలు.. స్పందించిన టెన్నిస్‌ స్టార్‌ తండ్రి

Sania Mirza-Shami: క్రికెటర్‌ షమీతో సానియా మీర్జా పెళ్లి జరగనుందంటూ వస్తోన్న వార్తలపై టెన్నిస్‌ స్టార్‌ తండ్రి స్పందించారు. ఈ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు.

Published : 21 Jun 2024 14:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా (Sania Mirza) మరోసారి వార్తల్లో నిలిచారు. పాక్‌ క్రికెటర్‌ షోయబ్ మాలిక్‌తో ఇటీవలే వివాహబంధానికి ముగింపు పలికిన ఆమె మళ్లీ పెళ్లి చేసుకోనున్నట్లు కొంతకాలంగా వదంతులు వినిపిస్తున్నాయి. టీమ్‌ఇండియా క్రికెటర్‌ మహమ్మద్‌ షమీ (Mohammed Shami)ని సానియా పెళ్లాడనున్నారని వాటి సారాంశం. వీటిపై టెన్నిస్‌ స్టార్‌ తండ్రి ఇమ్రాన్‌ మీర్జా తాజాగా స్పందించారు. ‘‘ఇవన్నీ చెత్త వార్తలు. సానియా కనీసం అతడిని(షమీ) కలవనేలేదు’’ అంటూ ఊహాగానాలను కొట్టిపారేశారు.

పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ను సానియా 2010లో వివాహం (Marraige) చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే ఈ ఏడాది జనవరిలో షోయబ్‌ మరో అమ్మాయిని వివాహం చేసుకోవడంతో వీరిద్దరూ విడిపోయినట్లు స్పష్టమైంది. అంతకు కొన్ని నెలల కిందటే వీరు విడాకులు తీసుకున్నట్లు సానియా కుటుంబం ప్రకటించింది. దీనిపై ఈ టెన్నిస్‌ స్టార్‌ నేరుగా స్పందించనప్పటికీ.. ఇటీవల హజ్‌ యాత్రకు వెళ్తూ ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టింది. ఈ యాత్రతో తన జీవితంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నానని, బలమైన వ్యక్తిగా తిరిగొస్తానని ఆమె రాసుకొచ్చారు. దీంతో తన వైవాహిక జీవితాన్ని ఉద్దేశిస్తూనే ఆమె పోస్ట్‌ పెట్టారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

రోహిత్‌ శర్మ ఔట్.. అది బలహీనత కాదు: గావస్కర్

మరోవైపు, షమీ 2014లో హసీన్‌ జహాన్‌ను వివాహం చేసుకున్నారు. కొన్నేళ్లుగా వీరి మధ్య తీవ్ర స్థాయిలో మనస్పర్థలు రావడంతో ప్రస్తుతం ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. వీరి విడాకుల కేసుపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని