Rohit Sharma: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రోహిత్‌ శర్మ వీడ్కోలు

టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన అనంతరం భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ 20 క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 

Updated : 30 Jun 2024 09:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత కెప్టెన్‌, స్టార్‌ ఆటగాడు రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. దక్షిణాఫ్రికాతో ఫైనల్‌లో గెలిచిన అనంతరం రోహిత్‌ ఈ ప్రకటన చేశాడు. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని రోహిత్‌ పేర్కొన్నాడు. రోహిత్‌ ప్రకటించడానికి కొన్నినిమిషాల ముందు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ టీ20కి వీడ్కోలు పలికాడు. దీంతో ఒకేరోజు ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు టీ20 బరి నుంచి తప్పుకోవడం భారత క్రికెట్‌ చరిత్రలో మరిచిపోలేని రోజుగా మిగిలిపోనుంది.      

టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ

మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో రోహిత్‌ మాట్లాడుతూ.. ‘‘టీ20లకు ఇదే నా చివరి మ్యాచ్‌. వీడ్కోలుకు ఇంతకుమించి ప్రకటించే మంచి సందర్భం లేదు. ఈ ట్రోఫీ కచ్చితంగా గెలవాలనుకున్నా. ఈ విషయం ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదు. నేను కోరుకున్నదే జరిగింది. ఈ సందర్భం రావడానికి నా జీవితంలో ఎంతో ఎదురుచూశాను. ఎంతో నిరాశకు గురయ్యాను. ఎట్టకేలకు ఆ హద్దులు దాటి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని 37 ఏళ్ల రోహిత్‌ పేర్కొన్నాడు. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 159 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌.. 4231 పరుగులు చేశాడు. ఇందులో ఐదు శతకాలు, 32 అర్ధశతకాలు ఉన్నాయి. రోహిత్‌ సారథ్యంలోనే భారత్‌ వన్డేలు, టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని