Rohit Sharma: రోహిత్‌ సేనకు ప్రపంచకప్‌ గెలిచే అర్హత ఉంది : పాక్‌ మాజీ క్రికెటర్‌ ప్రశంసలు

టీమ్‌ఇండియాపై పాక్‌ మాజీ క్రికెటర్‌ ప్రశంసలు కురిపించాడు.

Published : 26 Jun 2024 22:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పొట్టి ప్రపంచకప్‌లో వరుస విజయాలతో సెమీస్‌కు దూసుకొచ్చిన టీమ్‌ఇండియాపై దాయాది పాకిస్థాన్‌ ప్రశంసలు కురిపించింది. టీ20 ప్రపంచకప్‌ గెలవడానికి రోహిత్‌సేనకు అన్ని అర్హతలు ఉన్నాయని పాక్‌ మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ హఫీజ్‌ కొనియాడాడు. ఆస్ట్రేలియాపై రోహిత్‌ శర్మ కొట్టిన 92 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌ను పేర్కొంటూ.. అతడి ఆటతీరును మెచ్చుకున్నాడు.

‘ఛాంపియన్‌ ప్లేయర్‌లా రోహిత్‌ ఆడాడు. బౌలర్‌ ఎవరైనా లెక్క చేయలేదు. పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడే విజయాలు వస్తాయి. అతడి నాయకత్వంలో టీమ్‌ఇండియా  ప్రపంచకప్‌ నెగ్గడానికి అర్హత సాధించింది. రోహిత్‌ ప్రదర్శన ముందు మిగతావాళ్లు చిన్నగా కనిపిస్తారు. కెప్టెన్‌ నుంచి వచ్చిన అద్భుత ప్రదర్శన ఇది’’ అని హఫీజ్‌ పేర్కొన్నాడు.

ఇక భారత్‌.. గురువారం రెండో సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని