Rohit - Virat: హిట్‌మ్యాన్‌తో కోహ్లీ ఫొటో.. రోహిత్ శర్మ తల్లి ఇన్‌స్టా పోస్టు వైరల్

టీ20 ప్రపంచకప్ ఫైనల్ అనంతరం రోహిత్ శర్మ, కోహ్లీ ట్రోఫీతో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోను రోహిత్‌ తల్లి ఇన్‌స్టాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్‌గా మారింది.

Updated : 02 Jul 2024 15:51 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాను ఓడించి 17 ఏళ్ల తర్వాత పొట్టి కప్‌ని మరోసారి సాధించింది టీమ్ఇండియా. మ్యాచ్‌ అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Virat Kohli) భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కోహ్లీ వరల్డ్ కప్‌ ట్రోఫీని పట్టుకుని రోహిత్ శర్మ (Rohit Sharma)తో కలిసి ఫొటో దిగాడు. అప్పుడు రోహిత్ తన కుమార్తె సమైరాను భుజాలపైకి ఎత్తుకుని ఉన్నాడు. ఇద్దరు దిగ్గజాలు వరల్డ్ కప్‌తో ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఈ చిత్రం భారత క్రికెట్ చరిత్రలో మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. 

ఈ ఐకానిక్‌ ఫొటోను రోహిత్‌ శర్మ తల్లి పూర్ణిమ ఇన్‌స్టాలో పంచుకుంటూ హార్ట్ టచ్చింగ్ క్యాప్షన్‌ను జోడించింది. రోహిత్‌కు కోహ్లీని సోదరుడిగా పోల్చుతూ చేసిన ఈ పోస్టు వైరల్‌గా మారింది. ఆమె ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ ‘‘టీ20 క్రికెట్‌ దిగ్గజాలు ప్రపంచకప్‌ సాధించడం సంతోషంగా ఉంది. భుజాలపై కుమార్తె, దేశం మొత్తం వెనకాల, పక్కనే సోదరుడు’’ అంటూ ప్రత్యేక క్యాప్షన్‌ను రాసుకొచ్చారు. 

విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న తర్వాత వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని వార్తలొచ్చాయి. కానీ, ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకరినొకరు ఎంతగా అభిమానిస్తారో చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఈ టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ వరుస మ్యాచ్‌ల్లో విఫలమైనా.. రోహిత్ అతడిపై నమ్మకం ఉంచాడు. విరాట్‌ వైఫల్యం గురించి ఫైనల్ మ్యాచ్‌ ముంగిట కెప్టెన్‌ రోహిత్‌ను అడిగితే.. ‘‘విరాట్‌ స్థాయి ఏంటో మాకు తెలుసు. ముఖ్యమైన మ్యాచ్‌ల్లో అతనెలా ఆడతాడో తెలుసు. బహుశా ఫైనల్‌ కోసం అతను తన ఉత్తమ ప్రదర్శనను దాచుకున్నాడేమో’’ అన్నాడు. కెప్టెన్‌ మాటలను నిజం చేస్తూ కోహ్లి నిజంగానే ఫైనల్లో ఉత్తమ ప్రదర్శన చేశాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు