Rohit Sharma: రోహిత్ శర్మ.. తొలి కెప్టెన్‌గా రికార్డు

సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి భారత్ ఫైనల్‌కు చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్‌తో రాణించాడు.

Published : 28 Jun 2024 11:38 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే సారథిగా 5000+ పరుగులు చేసిన అతడు.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. పొట్టి కప్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. దీంతో 61 మ్యాచుల్లో 49 విజయాలతో జట్టును నడిపించాడు. విన్నింగ్‌ పర్సంటేజీ కూడా 78.68గా ఉంది. దీంతో పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ రికార్డును అధిగమించాడు. బాబర్ 85 మ్యాచుల్లో 48 విజయాలు నమోదు చేశాడు. అతడి విన్నింగ్ పర్సంటేజీ 56.47 శాతం మాత్రమే.

అద్భుతం చేశారు.. వెల్‌డన్‌: యూవీ

సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై భారత్‌ విజయం సాధించడంతో రోహిత్‌సేనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమ్‌ఇండియా మాజీ స్టార్‌ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. ‘‘అద్భుతంగా ఆడారు బాయ్స్. మరి ఇక గుడ్‌నైట్‌’’ అని ఎక్స్‌లో పోస్టు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు