IND vs SA: టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌.. బార్బడోస్‌లో వాతావరణం ఎలా ఉందంటే?

టైటిల్‌ను దక్కించుకోవాలని రెండు జట్లు సిద్ధం.. కానీ, వరుణుడు కూడా ఆడేస్తానంటూ పలకరింపులు.. ఇప్పుడు బార్బడోస్‌లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం..

Updated : 29 Jun 2024 19:12 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ఫైనల్‌కు వేళైంది. ఇవాళ రాత్రి 8 గంటలకు భారత్-దక్షిణాఫ్రికా (IND vs SA) జట్ల మధ్య తుది పోరు జరగనుంది. గ్రూప్‌, సూపర్‌-8, సెమీస్‌లో అజేయంగా ఫైనల్‌కు చేరిన రెండు జట్లు కప్‌ కోసం సర్వశక్తులూ ఒడ్డేందుకు సిద్ధమయ్యాయి. బార్బడోస్ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. 

నమ్మడం.. నడిపించడం.. ఇదే రోహిత్‌ మార్క్‌ కెప్టెన్సీ

పొట్టి కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగిస్తాడేమోనని అభిమానులు కాస్త ఆందోళనగా ఉన్నారు. గత రెండు సెమీస్‌లకు వర్షం అంతరాయం కలిగించింది. ఇప్పుడు ఫైనల్‌ మ్యాచ్‌ జరిగే బ్రిడ్జ్‌టౌన్‌ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులపై అందరి దృష్టి నెలకొంది. కరీబియన్‌లో ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఫైనల్‌ రోజు వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. అయితే, రిజర్వ్‌ డే ఉన్నందున ఫలితంపై ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. వాతావరణం అనుకూలిస్తే ఇవాళే ఫలితం రాబట్టేందుకు ఐసీసీ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం అక్కడ వాతావరణం ఎలా ఉందనేది చూద్దాం..

ఫైనల్‌కు వర్షం ముప్పు.. రిజర్వ్‌డే నాడూ మ్యాచ్‌ జరగకపోతే.. నిబంధనలు ఎలా ఉన్నాయ్‌..?

  • భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్‌ 7.30 గంటలకు వేస్తారు. ఫైనల్‌కు వేదికైన బార్బడోస్‌లో ఉదయం 10.30 గంటలు అవుతుంది.
  • రాత్రి 7 గంటల సమయానికి (భారత్‌ టైమ్‌) ఆకాశం మేఘావృతమై ఉంటుంది. టాస్‌ సమయానికి వాతావరణం మెరుగ్గా ఉండే అవకాశం. 
  • మ్యాచ్‌ మధ్యలో వర్షం పడే అవకాశాలున్నాయి. రాత్రి 11గంటల సమయంలో మెరుపులతో కూడిన జల్లులు పడతాయి. అదీనూ కాసేపు మాత్రమే ఉంటుంది. 
  • ఇవాళే పూర్తి స్థాయి మ్యాచ్‌ నిర్వహణకు ఇబ్బంది ఉండకపోవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. బార్బడోస్ సిబ్బంది కూడా మైదానాన్ని సిద్ధం చేసేందుకు రెడీగా ఉంటారని ఇప్పటికే ఐసీసీ స్పష్టం చేసింది.
  • ఇవాళ మ్యాచ్‌ పూర్తిగా సాధ్యం కాకపోతే ఎలానూ రిజర్వ్‌ డే ఉంది. అదనంగా 190 నిమిషాల సమయం కేటాయించారు. కనీసం 10 ఓవర్ల ఆట జరిగినా ఫలితం ప్రకటిస్తారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు