Olympic athletes: భారత్‌ గర్వించేలా చేస్తారు

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేస్తారని నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Updated : 05 Jul 2024 11:20 IST

ఒలింపిక్‌ అథ్లెట్లపై మోదీ

దిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేస్తారని నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లే దేశ అథ్లెట్లు గురువారం తనని కలిసిన సందర్భంగా ఆయన ఇలా వ్యాఖ్యానించారు. ‘‘పారిస్‌కు వెళ్లే భారత జట్టుతో ముచ్చటించాను. మన అథ్లెట్లు దేశం గర్వించేలా చేస్తారన్న నమ్మకముంది. వారి విజయాలు 140 కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి కావాలి’’ అని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. క్రీడల మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయా, భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష, బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కూడా అథ్లెట్ల వెంట ఉన్నారు. జావెలిన్‌త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా, బాక్సింగ్‌ ప్రపంచ ఛాంప్‌ నిఖత్‌ జరీన్, రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పి.వి.సింధులతో మోదీ వర్చువల్‌గా మాట్లాడి అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్‌కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్లు దండి జ్యోతిక శ్రీ, జ్యోతి యర్రాజి కూడా ప్రధానిని కలిసిన బృందంలో ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని