Prasidh Krishna: ప్రసిధ్ కృష్ణకు వచ్చే 12 నెలలు చాలా కీలకం..!

నిలకడైన స్పీడ్‌, కచ్చితమైన లెంగ్త్‌తో బౌలింగ్‌ చేస్తూ ఆకట్టుకుంటున్న టీమ్‌ఇండియా యువ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ ఒకడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటూ భారత జట్టులో..

Published : 23 Jul 2022 12:44 IST

న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ స్కాట్‌ స్టైరిస్‌

ఇంటర్నెట్ డెస్క్: నిలకడైన స్పీడ్‌, కచ్చితమైన లెంగ్త్‌తో బౌలింగ్‌ చేస్తూ ఆకట్టుకుంటున్న టీమ్‌ఇండియా యువ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ ఒకడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటూ భారత జట్టులో సుస్థిర స్థానం కోసం కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో ప్రసిధ్‌పై న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్‌ స్కాట్ స్టైరిస్‌ ప్రశంసలు కురిపించాడు. ఆసీస్‌ మాజీ బౌలర్‌ మెక్‌గ్రాత్‌లా తయారు కాగలిగే లక్షణాలు ప్రసిధ్‌లో ఉన్నాయన్నాడు. అయితే వచ్చే సంవత్సరం కాలం మాత్రం ప్రసిధ్‌ కృష్ణ ఎదుగుదలలో కీలకమని పేర్కొన్నాడు. 

‘‘ప్రసిధ్‌ కృష్ణను గ్లెన్‌ మెక్‌గ్రాత్‌తో పోల్చడం తప్పేమీ కాదనిపిస్తుంది. అందులో సందేహం కూడా లేదు. కానీ మెక్‌గ్రాత్‌ అంత స్థిరంగా బౌలింగ్‌ చేయడమే ప్రధానం. దానిని ప్రసిధ్‌ ఎప్పటికి సాధిస్తాడనేది మిలియన్‌డాలర్ల ప్రశ్న..!  ప్రస్తతుం ఆతడు వన్డేల్లో, టీ20ల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వన్డేల్లో పది ఓవర్లపాటు బౌలింగ్‌ చేయాల్సి ఉంటుంది. పేస్‌, బౌన్స్‌ను ఎదుర్కోవడం ఎంతటి బ్యాటర్‌కైనా ఇబ్బంది. కొత్త బంతితో చాలా బాగా బౌలింగ్‌ చేస్తున్నాడు. డెత్‌ ఓవర్లు (ఆఖరి ఓవర్లు) చాలా కీలకం. అలాంటి సమయంలో నిరూపించుకోవాల్సి ఉంటుంది. భారత టీ20 లీగ్‌లో తీవ్ర ఒత్తిడిలోనూ యార్కర్లు సంధించడం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. ఇలాంటి నైపుణ్యాలను ప్రసిధ్‌ ఇంకా మెరుగుపరుచుకోవాలి. అందుకే రాబోయే 12 నెలలు చాలా కీలకమని చెబుతున్నా’’ అని స్టైరిస్‌ వివరించాడు. ప్రస్తుతం ప్రసిధ్‌ కృష్ణ విండీస్‌తో వన్డే సిరీస్‌లో బిజీగా ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని