Team India: టీమ్‌ ఇండియాకు మహారాష్ట్ర ప్రభుత్వం బొనాంజా

T20 ప్రపంచకప్‌ సాధించిన టీమ్‌ ఇండియాకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.11 కోట్ల ప్రైజ్‌ మనీ ప్రకటించింది.

Published : 05 Jul 2024 21:59 IST

ముంబయి: 17 ఏళ్ల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ టీ20 ప్రపంచకప్‌ను (T20 Worldcup) సొంతం చేసుకున్న టీమ్‌ ఇండియాకు (Team India) భారత్‌ జేజేలు పలుకుతోంది. విశ్వవేదికపై భారతదేశ ఖ్యాతిని నిలబెట్టిన ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఐసీసీ (ICC) ఇచ్చిన రూ. 20 కోట్ల ప్రైజ్‌ మనీతోపాటు బీసీసీఐ (BCCI) రూ.125 కోట్ల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Govt) మరో రూ.11 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే శుక్రవారం ప్రకటించారు.

ముంబయి నుంచి ప్రాతినిథ్యం వహించిన రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, యశస్వి జైశ్వాల్‌ను విధాన్‌ భవన్‌లో సీఎం సత్కరించారు. ప్రపంచకప్‌ కప్‌ సాధించడంతోపాటు, దాయాది పాకిస్థాన్‌పై విజయం సాధించడం పట్ల శిందే హర్షం వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కీలక సమయంలో సూర్యకుమార్‌ యాదవ్‌ పట్టిన క్యాచ్‌ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. టీమ్‌ ఇండియా సపోర్ట్‌ సభ్యులు పరాస్‌ మాంబ్రే, అరుణ్‌ ఖనాడేలను కూడా మహారాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని