Indian Olympics team: భారత ఒలింపిక్స్‌ జట్టులో ‘లక్ష్య’ జ్యోతిక

పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెటిక్స్‌ జట్టులో ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీ (ఆంధ్రప్రదేశ్‌)కి చోటు దక్కింది.

Published : 05 Jul 2024 03:49 IST

దిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెటిక్స్‌ జట్టులో ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీ (ఆంధ్రప్రదేశ్‌)కి చోటు దక్కింది. మరో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి (ఆంధ్రప్రదేశ్‌) జట్టులో స్థానం సంపాదించింది. ఈనెల 26న ప్రారంభమయ్యే ఒలింపిక్స్‌లో స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా సారథ్యంలో భారత్‌ బరిలో దిగనుంది. మొత్తం 28 మంది భారత అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. అందులో 17 మంది పురుషులు కాగా 11 మంది మహిళలు.

పురుషులు: అవినాష్‌ సాబ్లె (3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌), నీరజ్‌ చోప్రా, కిషోర్‌కుమార్‌ జెనా (జావెలిన్‌ త్రో), తజిందర్‌పాల్‌ తూర్‌ (షాట్‌పుట్‌), ప్రవీణ్‌ చిత్రవేల్, అబ్దుల్లా అబూ బాకర్‌ (ట్రిపుల్‌ జంప్‌), అక్ష్దీప్‌ సింగ్, వికాస్‌ సింగ్, పరమ్‌జీత్‌సింగ్‌ బిస్త్‌ (20 కిమీ రేస్‌ వాక్‌), మహ్మద్‌ అనాస్, మహ్మద్‌ అజ్మల్, అమోజ్‌ జాకబ్, సంతోష్‌ తమిళరసన్, రాజేశ్‌ రమేశ్‌ (4×400 మీ రిలే), మిజో చాకో కురియన్‌ (4×400 మీ రిలే), సూరజ్‌ పన్వర్‌ (రేస్‌ వాక్‌ మిక్స్‌డ్‌ మారథాన్‌), సర్వేష్‌ అనిల్‌ కుశారె (హైజంప్‌)

మహిళలు: కిరణ్‌ పహల్‌ (400 మీ), పారుల్‌ చౌదరి (3000 మీ స్టీపుల్‌ఛేజ్, 5000 మీ), జ్యోతి యర్రాజి (100 మీ హర్డిల్స్‌), అన్ను రాణి (జావెలిన్‌ త్రో), అభా ఖతువా (షాట్‌పుట్‌), జ్యోతికశ్రీ దండి, శుభ వెంకటేశన్, విథ్య రామరాజ్, పూవమ్మ (4×400 మీ రిలే), ప్రాచి (4×400 మీ), ప్రియాంక గోస్వామి (20 కీమీ రేస్‌ వాక్‌/ రేస్‌ వాక్‌ మిక్స్‌డ్‌ మారథాన్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని