Venkatesh Iyer: ఓ ఇంటివాడైన భారత క్రికెటర్ వెంకటేశ్‌ అయ్యర్

ఐపీఎల్‌ టైటిల్‌ను కోల్‌కతా సాధించడంలో వెంకటేశ్‌ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. తాజాగా వివాహబంధంలోకి అడుగు పెట్టాడు.

Published : 02 Jun 2024 16:18 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెటర్ వెంకటేశ్‌ అయ్యర్ ఓ ఇంటివాడయ్యాడు. శ్రుతి రఘునాథన్‌తో వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. గతేడాది నవంబర్‌లో వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌ మాస్టర్స్‌ డిగ్రీ చేసిన శ్రుతి ప్రస్తుతం బెంగళూరులోని ఓ సంస్థలో పని చేస్తున్నారు. వెంకటేశ్‌ - శ్రుతి జంటకు క్రికెట్ ఫ్యాన్స్‌ శుభాకాంక్షలు చెబుతూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. 

ఐపీఎల్ 2024 సీజన్‌ టైటిల్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నెగ్గడంలో వెంకటేశ్‌ అయ్యర్‌ కీలక పాత్ర పోషించాడు. తొలి క్వాలిఫయర్‌, ఫైనల్‌లో హాఫ్ సెంచరీలు సాధించాడు. భారత జట్టు తరఫున రెండు వన్డేలు, 9 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని