Jasprit Bumrah: తన పేరిట నకిలీ ఖాతా.. జస్‌ప్రీత్‌ బుమ్రా సతీమణి ఆగ్రహం!

తన పేరిట ఫేక్‌ అకౌంట్‌ను సృష్టించడంపై భారత జట్లు స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సతీమణి సంజనా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated : 03 Jul 2024 16:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమ్‌ఇండియా టీ20 ప్రపంచ కప్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రోఫీతో టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) కుటుంబం దిగిన ఫొటోలు ఓ నకిలీ ఖాతా ద్వారా నెట్టింట వైరల్‌గా మారాయి. తన పేరుతో ఫేక్‌ అకౌంట్‌ సృష్టించడంపై బుమ్రా సతీమణి సంజనా గణేశన్‌ (Sanjana Ganesan) తీవ్రంగా స్పందించారు. సమాచారాన్ని దొంగలించారంటూ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ఫైర్‌ అయ్యారు.

‘‘మా కుటుంబం ఫొటోలు, సమాచారాన్ని దొంగలించి అచ్చం నా ఖాతా లాంటి మరో ఫేక్‌ అకౌంట్‌ను సృష్టించారు. వెంటనే దీన్ని తొలగించండి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’’ అని హెచ్చరించారు. ఆమె పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

సూర్య క్యాచ్‌ సరైందే.. ముందు మీ బుర్రను సరిచేసుకోండి: చోప్రా

కాగా.. టీ20 ప్రపంచ కప్‌లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఈ విజయంపై హర్షం వ్యక్తం చేసిన సంజనా భర్తపై ఎమోషనల్‌ పోస్టు చేశారు. ‘‘భారత్‌ జట్టు పడిన శ్రమను చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. ఈ విజయంతో భారత్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఇక నా భర్త బుమ్రా పడిన శ్రమ స్ఫూర్తిదాయకం. మీరు నా వాడని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

సముద్ర జీవులపై రోహిత్‌ సతీమణి పోస్టు..

హరికేన్‌ ప్రభావంతో బార్బడోస్‌లో చిక్కుకుపోయిన టీమ్‌ఇండియా.. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో దిల్లీకి బయలుదేరింది. ఈ నేపథ్యంలోనే అక్కడి పరిస్థితిపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సతీమణి రితికా సజ్దే (Ritika Sajdeh) స్పందించారు. హరికేన్‌ సముద్ర జీవులపై తీవ్ర ప్రభావం చూపడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని సముద్ర జీవుల ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇవి బార్బడోస్‌లోని పరిస్థితికి అద్దం పడుతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు