INDw Vs SAw: మహిళా టెస్టు క్రికెట్‌లో టీమ్‌ఇండియా రికార్డు స్కోరు

టెస్టు క్రికెట్‌లో భారత మహిళా జట్టు రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది.

Updated : 29 Jun 2024 12:37 IST

ఇంటర్నెట్ డెస్క్: మహిళా టెస్టు క్రికెట్‌లో (Womens Cricket) టీమ్‌ఇండియా రికార్డు నమోదు చేసింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 603/6 స్కోరు చేసి డిక్లేర్డ్‌ చేసింది. దీంతో 90 ఏళ్ల ఉమెన్స్‌ టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా భారత్‌ అవతరించింది. అంతకుముందు ఆస్ట్రేలియా పేరిట ఈ రికార్డు ఉండేది. ఇదే ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపైనే 575/9 (డిక్లేర్డ్) ఆసీస్‌ స్కోరు చేసింది. 

దక్షిణాఫ్రికాతో ఓవర్‌ నైట్‌ 525/4 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ (INDw Vs SAw) అదే దూకుడు కొనసాగించింది. హర్మన్‌ (69), రిచా ఘోష్‌ (86) ఐదో వికెట్‌కు 143 పరుగులు జోడించారు. ఆ తర్వాత వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసిన టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సఫారీల జట్టు తన తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని