INDw Vs SAw: మన అమ్మాయిలూ గెలిచేశారు!

దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది

Updated : 01 Jul 2024 16:21 IST

చెన్నై: దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సోమవారం రెండో ఇన్నింగ్స్‌ (ఫాలోఆన్‌)ను 232/2 స్కోరుతో ఆరంభించిన దక్షిణాఫ్రికా.. 373 పరుగులకు ఆలౌటై భారత్‌కు 37 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్‌ని టీమ్‌ఇండియా 9.2 ఓవర్లలో పూర్తి చేసింది. షఫాలీ వర్మ (24*), శుభా సతీష్ (13) పరుగులు చేశారు.

తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 603/6 రికార్డు స్కోరు సాధించి డిక్లేర్డ్ చేసింది. షెఫాలి వర్మ (205; 197 బంతుల్లో 23×4, 8×6) డబుల్ సెంచరీతో అదరగొట్టగా.. స్మృతి మంధాన (149; 161 బంతుల్లో 27×4, 1×6) మరోసారి సత్తాచాటింది. రిచా ఘోష్‌ (86; 90 బంతుల్లో 16 ఫోర్లు), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (69; 115 బంతుల్లో 4 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్‌ (55; 94 బంతుల్లో 8×4) కూడా రాణించారు. 

ఆఫ్‌ స్పిన్నర్‌ స్నేహ్‌ రాణా (8/77) విజృంభణతో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా.. 84.3 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. మారిజేన్ కాప్ (74), సునే లూస్‌ (65) మాత్రమే రాణించడంతో దక్షిణాఫ్రికా ఫాలోఆన్‌ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో లారా వోల్వార్ట్ (122), సునే లూస్ (109) శతకాలు బాదగా.. నాడిన్ డిక్లెర్క్‌ (61) హాఫ్ సెంచరీ సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ ఓటమి నుంచి తప్పించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు స్నేహ్‌ రాణా 2, దీప్తి శర్మ 2, రాజేశ్వరి గైక్వాడ్ 2, పూజా వస్త్రాకర్‌, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ తలో వికెట్ పడగొట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని