INDw Vs SAw: దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు.. రెండో రోజు ముగిసిన ఆట

భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఏకైక టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. 

Published : 29 Jun 2024 17:26 IST

చెన్నై: దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత అమ్మాయిల జట్టు భారీ విజయం దిశగా సాగుతోంది. ఓవర్‌ నైట్‌ 525/4 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 603/6 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఆ జట్టు 236/4 స్కోరు చేసింది. ఓపెనర్లు వోల్వార్ట్ (20), అన్నేకే (39) పరుగులు చేశారు. వన్‌డౌన్ బ్యాటర్ సునే లూస్ (65) అర్ధ శతకం బాదింది. డెల్మీ టక్కర్ (0) డకౌట్‌ అయింది. ప్రస్తుతం మారిజానే కాప్ (69*; 125 బంతుల్లో 8 ఫోర్లు), నాడిన్ డి క్లర్క్ (27*; 28 బంతుల్లో 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా 3, దీప్తి శర్మ ఒక వికెట్ పడగొట్టారు. 

తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన టీమ్ఇండియా అద్భుతమైన రికార్డు సృష్టించింది. 90 ఏళ్ల ఉమెన్స్‌ టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా భారత్‌ అవతరించింది. అంతకుముందు ఆస్ట్రేలియా పేరిట ఈ రికార్డు ఉండేది. ఇదే ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపైనే 575/9 (డిక్లేర్డ్) ఆసీస్‌ స్కోరు చేసింది.  ఓవర్‌ నైట్‌ 525/4 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత బ్యాటర్లు హర్మన్‌ (69), రిచా ఘోష్‌ (86) ఐదో వికెట్‌కు 143 పరుగులు జోడించారు. ఆ తర్వాత వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని