INDw vs SAw: దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో ఏకైక టెస్టు.. భారత ఓపెనర్ల సరికొత్త రికార్డు

దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టులో భారత మహిళా జట్టు దూకుడుగా ఆడుతోంది.

Updated : 28 Jun 2024 13:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత మహిళా క్రికెటర్లు చరిత్ర సృష్టించారు. టెస్టుల్లో తొలి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం నమోదు చేసిన ఘనతను ఖాతాలో వేసుకున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో స్మృతి మంధాన (149), షఫాలీ వర్మ (128*) సెంచరీలు బాదేశారు. దీంతో తొలి వికెట్‌కు 292 పరుగులు (52 ఓవర్లలో) జోడించారు. ఇప్పటివరకు మహిళా టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలి వికెట్‌కు 241 పరుగులు చేసిన కిరణ్‌ బలుచ్, సజ్జిదా షా జోడీ రికార్డును భారత బ్యాటర్లు అధిగమించారు. మరింత దూకుడుగా ఆడే క్రమంలో స్మృతి మంధాన పెవిలియన్‌కు చేరింది.


లంచ్‌ బ్రేక్‌కు ఇలా.. 

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక తొలి టెస్టు మ్యాచ్‌లో భారత (IND w Vs SA w) అమ్మాయిలు శుభారంభం చేశారు. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్ జట్టు తొలి రోజు లంచ్‌ బ్రేక్‌ సమయానికి వికెట్ నష్టపోకుండా 130 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (65*), స్మృతి మంధాన (64*) అర్ధశతకాలు సాధించారు. ఆరుగురు దక్షిణాఫ్రికా బౌలర్లు ప్రయత్నించినా వికెట్‌ మాత్రం తీయలేకపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని