ఫైనల్‌ పోరు.. టీమ్‌ఇండియాకు ఎదురుందా..? ఆ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో తలపడేందుకు టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి.

Published : 29 Jun 2024 00:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటమే లేకుండా ఆ రెండు జట్లు ఫైనల్‌కు దూసుకొచ్చాయి. ఒక జట్టేమో సుదీర్ఘ నిరీక్షణకు తెరిదించాలని కసి మీద ఉంటే.. తొలిసారి టైటిల్‌ ముద్దాడాలని మరో జట్టు పట్టుదలగా ఉంది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో నువ్వా.. నేనా? అన్నట్లు తలపడేందుకు రెండు జట్లూ సిద్ధమయ్యాయి. అవే టీమ్‌ ఇండియా, దక్షిణాఫ్రికా. ఈ రెండు జట్ల మధ్య టీ20 గణాంకాలను పరిశీలిస్తే..

ఎవరు,  ఎలా అడారంటే?

  • ఈ రెండు జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో టీమ్‌ ఇండియా 14 సార్లు గెలిస్తే.. దక్షిణాఫ్రికా 11 సార్లు విజయం సాధించింది.
  • ఇందులో 10 సార్లు భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి గెలవగా.. దక్షిణాఫ్రికా అలా మూడు సార్లు మాత్రమే గెలిచింది.
  • ఇక ఛేదనలో భారత్‌ నాలుగు సార్లు గెలిస్తే.. సఫారీలు 8 సార్లు గెలుపొందారు.
  • అత్యధిక స్కోర్లు: భారత్‌ - 237.. దక్షిణాఫ్రికా - 227. అత్యల్ప సోర్లు: భారత్‌ - 92.. దక్షిణాఫ్రికా - 87
  • టీ20 వరల్డ్‌కప్‌ల్లో ఆరుసార్లు తలపడగా.. భారత్‌ నాలుగింట్లో, దక్షిణాఫ్రికా రెండింట్లో గెలిచాయి.
  • సఫరాలీపై ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌ రోహిత్‌ శర్మ (420 పరుగులు). భారత్‌పై డేవిడ్‌ మిల్లర్‌ అత్యధిక పరుగులు (431) చేశాడు.
  • దక్షిణాఫ్రికాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా రోహిత్‌ (106)దే. అటువైపు మిల్లర్‌ ఇదే స్కోర్‌ (106)తో ఉన్నాడు.
  • ఎక్కువ సిక్స్‌లు: సూర్య కుమార్‌ యాదవ్‌ (23), మిల్లర్‌ (29)
  • దక్షిణాఫ్రికాపై అత్యధిక బౌండరీలు కొట్టింది హిట్‌ మ్యానే. రోహిత్‌ 49 కొట్టగా.. డికాక్‌ మనపై 29 బాదాడు.
  • ఎక్కువ అర్ధ శతకాలు: సూర్య కుమార్‌ యాదవ్‌ 4.. డికాక్‌ 4.
  • శతకాలు: సూర్య, రోహిత్‌, రైనా ఒక్కో శతకం నమోదు చేయగా.. అటు వైపు రిలీ రుస్సో, డేవిడ్‌ మిల్లర్‌ చెరో సెంచరీ బాదారు.
  • ఎక్కువ వికెట్లు: భువనేశ్వర్‌ కుమార్‌ (14).. కేశవ్‌ మహరాజ్‌ (10), లుంగి ఎంగిడి (10)
  • అత్యుత్తమ బౌలింగ్‌: కుల్‌దీప్‌ యాదవ్‌ (5/17).. లుంగి ఎంగిండి (4/21)

ఫైనల్‌ జరిగే బార్బడోస్‌లో..

  • భారత్‌ ఆడింది 3.. గెలిచింది 1. అత్యధిక పరుగులు 181. అత్యల్ప స్కోరు 135.
  • దక్షిణాఫ్రికా ఆడింది 3.. గెలిచింది 2. అత్యధిక స్కోరు 170. అత్యల్పం 129.
  • ఈ వేదికగా మొత్తం 32 టీ20లు జరగ్గా.. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లు 19 సార్లు గెలిచాయి. 11 సార్లు సెకండ్‌ బ్యాటింగ్‌ చేసిన జట్లు విజయం సాధించాయి. రెండు సార్లు ఫలితం తేలలేదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని