Kedar Jadhav: క్రికెట్‌కు జాదవ్‌ వీడ్కోలు

భారత క్రికెట్‌ మాజీ ఆటగాడు కేదార్‌ జాదవ్‌ ఆటకు వీడ్కోలు పలికాడు. నాలుగేళ్ల క్రితం చివరిగా టీమ్‌ఇండియాకు ఆడిన ఈ 39 ఏళ్ల మిడిలార్డర్‌ బ్యాటర్‌.. సోమవారం రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు.

Published : 04 Jun 2024 02:18 IST

పుణె: భారత క్రికెట్‌ మాజీ ఆటగాడు కేదార్‌ జాదవ్‌ ఆటకు వీడ్కోలు పలికాడు. నాలుగేళ్ల క్రితం చివరిగా టీమ్‌ఇండియాకు ఆడిన ఈ 39 ఏళ్ల మిడిలార్డర్‌ బ్యాటర్‌.. సోమవారం రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. ‘‘కెరీర్‌ ఆసాంతం ఎంతో మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రిటైర్‌ అయినట్లు భావించండి’’ అని 2020లో మహేంద్రసింగ్‌ ధోని మాదిరిగానే జాదవ్‌ ట్వీట్‌ చేశాడు. 2015 రాంచీలో శ్రీలంకపై వన్డేతో అరంగేట్రం చేసిన జాదవ్‌.. చివరిగా 2020 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌పై వన్డే రూపంలో ఆఖరి మ్యాచ్‌ ఆడాడు. జాదవ్‌ 73 వన్డేలు, 9 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. వన్డేల్లో 2 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు సహా 1389 పరుగులు చేసిన అతడు.. ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌తో 27 వికెట్లు కూడా తీశాడు. టీ20ల్లో 122 పరుగులే చేశాడు. 2017లో ఇంగ్లాండ్‌పై పుణెలో జరిగిన వన్డేలో 76 బంతుల్లోనే 120 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకమయ్యాడు. ఈ మ్యాచ్‌లో 351 పరుగుల ఛేదనలో భారత్‌ 63/4తో కష్టాల్లో ఉన్నప్పుడు.. కోహ్లి (122)తో కలిసి అయిదో వికెట్‌కు 200 పరుగులు జత చేశాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని