IND Vs PAK: మార్చి 1న భారత్, పాక్‌ పోరు!

అసలు ఛాంపియన్స్‌ ట్రోఫీ జరుగుతుందో లేదో తెలియదు, జరిగితే టోర్నీ ఆతిథ్య దేశం పాకిస్థాన్‌లో భారత్‌ పర్యటిస్తుందా అన్నదానిపై స్పష్టత లేదు గానీ.. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ముహూర్తం ఖరారైపోయింది.

Published : 04 Jul 2024 03:19 IST

దిల్లీ: అసలు ఛాంపియన్స్‌ ట్రోఫీ జరుగుతుందో లేదో తెలియదు, జరిగితే టోర్నీ ఆతిథ్య దేశం పాకిస్థాన్‌లో భారత్‌ పర్యటిస్తుందా అన్నదానిపై స్పష్టత లేదు గానీ.. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ముహూర్తం ఖరారైపోయింది. వచ్చే ఏడాది జరగాల్సిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా మార్చి 1న లాహోర్‌లో భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ నిర్వహించేందుకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ప్రణాళికలు సిద్ధం చేసింది. ముసాయిదా షెడ్యూల్‌ను ఇప్పటికే బీసీసీఐకి పంపింది కూడా. 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీకి పాక్‌ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. ‘‘15 మ్యాచ్‌ల ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ ముసాయిదాను ఐసీసీకి పీసీబీ సమర్పించింది. లాహోర్‌లో ఏడు, కరాచీలో మూడు, రావల్పిండిలో అయిదు మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్‌ మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే నిర్వహిస్తారు. ఛాంపియన్స్‌ ట్రోఫీకి పూర్తి మద్దతు ఇస్తామని భారత్‌ మినహా మిగతా బోర్డులన్నీ పీసీబీకి హామీ ఇచ్చాయి. ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే తమ అభిప్రాయాన్ని చెప్తామని ఐసీసీకి బీసీసీఐ తెలిపింది’’ అని ఐసీసీ బోర్డు సభ్యుడు పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని