T20 WC 2026: టీ20 ప్రపంచ కప్‌ 2026 స్వరూపం ఇదే! 12 జట్లకు నేరుగా అర్హత

2026లో జరిగే టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2026) స్వరూపాన్ని ఐసీసీ ప్రకటించింది.

Updated : 02 Jul 2024 14:14 IST

ముంబయి: ఈ టీ20 వరల్డ్ కప్‌ ముగిసిందో లేదో వచ్చే పొట్టి కప్ (2026) స్వరూపాన్ని ఐసీసీ ప్రకటిచింది. ఇటీవల ముగిసిన పొట్టి కప్‌ మాదిరిగానే రెండు ప్రాథమిక రౌండ్లు, నాకౌట్‌గా టోర్నీ ఉంటుంది. 2024 తరహాలోనే 2026లోనూ 20 జట్లు పోటీపడతాయి. 2026 టీ20 ప్రపంచ కప్‌లో మొత్తం 12 జట్లకు నేరుగా అర్హత లభించనుంది. ఆతిథ్య జట్ల హోదాలో భారత్‌, శ్రీలంకతోపాటు రన్నరప్‌ హోదాలో దక్షిణాఫ్రికాకు నేరుగా అవకాశం లభించింది. 

2024 టీ20 ప్రపంచ కప్‌లో సూపర్‌-8కు అర్హత సాధించిన  అఫ్గానిస్థాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఇంగ్లాండ్, వెస్టిండీస్, అమెరికా వచ్చే ప్రపంచ కప్‌నకు నేరుగా క్వాలిఫై అయ్యాయి. ఈ సారి సూపర్‌-8కు చేరుకోలేనప్పటికీ జూన్‌ 30నాటికి టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా న్యూజిలాండ్ (6వ ర్యాంకు), పాకిస్థాన్‌ (7వ ర్యాంకు), ఐర్లాండ్ (11వ ర్యాంక్) 2026 టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించాయి. మరో 8 జట్ల ఎంపిక కోసం ప్రపంచవ్యాప్తంగా క్వాలిఫయింగ్‌ టోర్నీలు జరుగుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు