Hardik Pandya: ఆల్‌రౌండర్‌ నం.1 హార్దిక్‌

టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య.. అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ టీ20 ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించిన తొలి భారత ఆటగాడయ్యాడు.

Published : 04 Jul 2024 03:24 IST

దుబాయ్‌: టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య.. అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ టీ20 ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించిన తొలి భారత ఆటగాడయ్యాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో బ్యాటుతో, బంతితో అదరగొట్టిన హార్దిక్‌.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగై అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అతనీ టోర్నీలో 144 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లో హార్దిక్‌ 3 వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పిన సంగతి తెలిసిందే. హార్దిక్‌ ఖాతాలో 222 పాయింట్లున్నాయి. శ్రీలంక ఆల్‌రౌండర్‌ హసరంగ కూడా 222 పాయింట్లే సాధించినప్పటికీ దశాంశాల తేడాతో  అతణ్ని హార్దిక్‌ వెనక్కి నెట్టాడు. మార్కస్‌ స్టాయినిస్‌ (ఆస్ట్రేలియా-211) మూడో స్థానం సాధించాడు.  బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా ఒకేసారి 12 స్థానాలు మెరుగై 12వ ర్యాంకుకు చేరుకున్నాడు. 2020 తర్వాత బుమ్రాకిదే ఉత్తమ ర్యాంకు. అడిల్‌ రషీద్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. అక్షర్‌ పటేల్, కుల్‌దీప్‌ వరుసగా 7, 9 స్థానాల్లో నిలిచారు. బ్యాటర్లలో ట్రావిస్‌ హెడ్‌ అగ్రస్థానంలో ఉండగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో స్థానం సాధించాడు. యశస్వి జైస్వాల్‌ (7) కూడా టాప్‌-10లో ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని