- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Kishane Thompson: వందలో మరో చిరుత.. ఉసేన్ బోల్ట్‌ను గుర్తుచేస్తూ..
100 మీటర్ల పరుగు అనగానే ఉసేన్ బోల్ట్ గుర్తొస్తాడు! అతడి అనితర సాధ్యమైన రికార్డులు గుర్తొస్తాయి. తన ఆటతో హవభావాలతో స్ప్రింట్‌కు అతడు తెచ్చిన క్రేజ్ అలాంటిది. బోల్ట్ రిటైరై ఏడేళ్లయినా అతడిలా పరుగులో ఆధిపత్యం చెలాయించే మరో వీరుడు రాలేదు.
ఈనాడు క్రీడావిభాగం
100 మీటర్ల పరుగు అనగానే ఉసేన్ బోల్ట్ గుర్తొస్తాడు! అతడి అనితర సాధ్యమైన రికార్డులు గుర్తొస్తాయి. తన ఆటతో హవభావాలతో స్ప్రింట్‌కు అతడు తెచ్చిన క్రేజ్ అలాంటిది. బోల్ట్ రిటైరై ఏడేళ్లయినా అతడిలా పరుగులో ఆధిపత్యం చెలాయించే మరో వీరుడు రాలేదు. బోల్ట్ రికార్డులు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. ఆ రికార్డులు చెదురుతాయో లేదో గానీ.. వేగంలో ఉసేన్‌ను గుర్తుచేస్తూ అతడి దేశం జమైకా నుంచే మరో చిరుత దూసుకొస్తోంది. 100 మీటర్ల పరుగులో ఈ రెండేళ్లలోనే అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న ఆ అథ్లెటే కిషేన్ థాంప్సన్. జమైకా ట్రయల్స్‌లో 9.77 సెకన్లు నమోదు చేసిన థాంప్సన్ పారిస్ ఒలింపిక్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.
బోల్ట్‌ను అందుకోవాలని
100 మీటర్ల పరుగులో ఒక సెకన్ తగ్గించాలన్నా కఠోర శ్రమ చేయాలి. కొన్నిసార్లు ఎంతగా శ్రమించినా కొద్దిగైనా టైమింగ్ తగ్గించుకోలేక రిటైరైన అథ్లెట్లు చాలామంది ఉంటారు. అందుకే 2009 బెర్లిన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బోల్ట్ 9.58 సెకన్లలో సృష్టించిన ప్రపంచ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ప్రత్యర్థులు ఈ రికార్డు బద్దలు కొట్టడం కాదు కనీసం దరిదాపులకు కూడా రాలేకపోతున్నారు. బోల్ట్ సమకాలికులు టైసన్ గే (9.69 సె), యెహాన్ బ్లేక్ (9.69 సె), అసాఫా పావెల్ (9.72 సె), గాట్లిన్ (9.74 సె) లాంటి వాళ్లు ఈ ఘనతను అందుకోవడానికి గట్టిగానే ప్రయత్నించి విఫలమయ్యారు. చిత్రంగా బోల్ట్ తర్వాత జమైకా నుంచి అంతటి స్థాయి అథ్లెట్ రాలేదు. కొన్నేళ్లుగా స్ప్రింట్‌లో అమెరికాదే హవా. ఈ నేపథ్యంలో థాంప్సన్ వెలుగులోకి రావడం ట్రాక్‌ను వేడెక్కిస్తోంది. 22 ఏళ్ల థాంప్సన్‌కు బోల్ట్ రికార్డును సవాల్ చేసే దమ్ము ఉంది అని విశ్లేషకులు నమ్ముతున్నారు. దిగ్గజ బోల్ట్‌కు వారసుడొచ్చాడంటూ పోలికలు కూడా పెడుతున్నారు. ఎందుకంటే జమైకా ఒలింపిక్ ట్రయల్స్‌లో థాంప్సన్ ప్రదర్శించిన వేగం అలాంటిది మరి.
వేగాన్ని పెంచేశాడు
జమైకా ట్రయల్స్‌లో థాంప్సన్ ఆరంభించిన దానికి ముగించిన వైనానికి సంబంధమే లేదు. హీట్స్ వరకు వచ్చేసరికి మిగిలిన అథ్లెట్లతో దగ్గరగా టైమింగ్ నమోదు చేసిన అతడు.. ఫైనల్లో ప్రత్యర్థుల కంటే ఎంతో మెరుగ్గా పరుగెత్తాడు. మొదట హీట్స్‌లో 9.82 సెకన్లలో రేసు పూర్తి చేసిన అతడు.. సెమీఫైనల్లోనూ 9.84 సెకన్లలో పరుగెత్తాడు. కానీ ఫైనల్లో పరుగే చాలా భిన్నం. తొలి 60 మీటర్లు మెరుపువేగంతో దూసుకుపోయిన అతడు అందర్ని వెనక్కి నెట్టేశాడు. ఆ తర్వాత కాస్త స్పీడ్ తగ్గించినా 9.77 సెకన్లలో రేసు పూర్తి చేశాడు. టేకాఫ్ అయిన సమయంలో అందరితో సమానంగానే కనిపించిన అతడు.. కొద్దిసేపటికే మిగిలినవాళ్లతో వేరయ్యాడు. ఆ తర్వాత బోల్ట్ మాదిరే ప్రత్యర్థులు దూరంలో ఉండగానే ఫినిషింగ్ లైన్ దాటాడు. కోచ్ సూచన మేరకు తొలి 60 మీటర్ల దూరం వేగంగా పరుగెత్తానని.. తర్వాతి 40 మీటర్లు నెమ్మదించానని థాంప్సన్ వివరించాడు. అతడి టైమింగ్ 100 మీటర్ల రేసు చరిత్రలో తొమ్మిదో వేగవంతమైంది కావడం విశేషం. ఈ క్రమంలో ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేత అకీమ్ బ్లేక్‌ను కూడా వెనక్కి నెట్టాడు. ఈ నెలలో ఈ జమైకా అథ్లెట్ రెండోసారి అకీమ్‌ను ఓడించాడు. మొదట జూన్ 6న జాతీయ ఛాంపియన్‌షిప్‌లో 9.92 సెకన్ల టైమింగ్‌తో థాంప్సన్ అగ్రస్థానంలో నిలిచాడు. పారిస్‌లో పూర్తి స్థాయిలో పరుగెత్తితే కచ్చితంగా ఇంకా తక్కువ సమయంలో రేసు పూర్తి చేసే అవకాశాలున్నాయి. కానీ ఒలింపిక్స్‌లో థాంప్సన్‌కు గట్టిపోటీ ఎదురు కానుంది. అమెరికా స్టార్లు కోల్మన్, నోవా లేల్స్, ఫ్రెడ్ కెర్లీ బరిలో ఉన్నారు. మరి వారి పోటీని తట్టుకుని థాంప్సన్ నిలవగలిగితే ఉసేన్ వారసుడు వచ్చేసినట్టే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వదేశంలో అడుగు పెట్టిన టీమ్ఇండియా.. రోహిత్ డ్యాన్స్ అదుర్స్
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) డ్యాన్స్‌తో అలరించాడు. వరల్డ్ కప్‌తో టీమ్ఇండియా ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. దిల్లీ విమానాశ్రయం బయట అభిమానులతో కలిసి సరదాగా డ్యాన్స్ వేశాడు.
-
వరల్డ్ కప్ మెడల్‌తో పంత్.. ట్రోల్ చేసిన అక్షర్, సిరాజ్
పొట్టి కప్‌ను నెగ్గిన భారత ఆటగాళ్లు ఎట్టకేలకు స్వదేశానికి చేరారు. వారికి ఘనస్వాగతం లభించింది. దిల్లీ విమానాశ్రయంలో అభిమానులు, అధికారుల మధ్య ప్లేయర్లు డ్యాన్సులతో కాసేపు హంగామా చేశారు. -
1983 TO 2024.. టీమ్ఇండియా ‘ప్రపంచ కప్’ల సంబురం
తొలిసారి 1983లో వన్డే ప్రపంచ కప్‌ను గెలిచిన టీమ్ఇండియా.. తాజాగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ నాయకత్వంలో అద్భుత ప్రదర్శన చేసి సగర్వంగా ఇంటికి తిరిగొచ్చింది.
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
T20 World Cup: 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఉదయం దిల్లీలో అడుగు పెట్టిన రోహిత్ సేన.. అక్కడే ప్రధానితో సమావేశం కాబోతోంది. -
ఆల్‌రౌండర్ నం.1 హార్దిక్
టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ టీ20 ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించిన తొలి భారత ఆటగాడయ్యాడు. -
అదరగొట్టిన అల్కరాస్
టైటిల్ ఫేవరెట్ మూడో సీడ్ కార్లోస్ అల్కరాస్ వింబుల్డన్‌లో దూసుకెళ్తున్నాడు. అతను అలవోకగా మూడో రౌండ్ చేరాడు. అయిదో సీడ్ మెద్వెదెవ్ రెండో రౌండ్‌ను అధిగమించగా.. ఎనిమిదో సీడ్ రూడ్‌కు ఫోగ్నిని షాకిచ్చాడు. -
క్వార్టర్స్‌లో తుర్కియే
తొలి నిమిషంలో గోల్.. ఆఖరి సెకన్లలో అద్భుత సేవ్‌తో తుర్కియే యూరో కప్ ఫుట్‌బాల్‌లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. నాకౌట్ మ్యాచ్ (రౌండ్ ఆఫ్ 16)లో ఆ జట్టు 2-1తో ఆస్ట్రియాపై విజయం సాధించింది. -
కొత్త సవాల్‌ను అధిగమించాం
ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఎదురవుతున్న కొత్త సవాల్‌ను అధిగమించినట్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం తెలిపింది. -
మార్చి 1న భారత్, పాక్ పోరు!
అసలు ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందో లేదో తెలియదు, జరిగితే టోర్నీ ఆతిథ్య దేశం పాకిస్థాన్‌లో భారత్ పర్యటిస్తుందా అన్నదానిపై స్పష్టత లేదు గానీ.. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ముహూర్తం ఖరారైపోయింది. -
అది తప్పుకోవడం కాదు
పారిస్ డైమండ్ లీగ్ నుంచి తాను తప్పుకున్నట్లు వస్తున్న వార్తలపై భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్పష్టత ఇచ్చాడు. -
బాయ్‌కాట్‌కు మళ్లీ క్యాన్సర్
ఇంగ్లాండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ రెండోసారి గొంతు క్యాన్సర్ బారినపడ్డాడు. రెండు వారాల్లో అతడికి శస్త్రచికిత్స జరగనుంది.
తాజా వార్తలు (Latest News)
-
కరకట్టపై దస్త్రాల దహనం.. విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశం
-
సందేహం అక్కర్లేదు.. నేనే అధ్యక్ష అభ్యర్థిని: బైడెన్
-
వరల్డ్ కప్ మెడల్‌తో పంత్.. ట్రోల్ చేసిన అక్షర్, సిరాజ్
-
ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
-
ఘనంగా వరలక్ష్మీ శరత్‌కుమార్ రిసెప్షన్.. తారల సందడి
-
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ