అల్కరాస్‌ శుభారంభం

మూడో సీడ్‌ అల్కరాస్‌ వింబుల్డన్‌లో శుభారంభం చేశాడు. అయిదోసీడ్‌ మెద్వెదెవ్, ఎనిమిదో సీడ్‌ రూడ్‌ కూడా రెండో రౌండ్లో ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌లో తొమ్మిదో సీడ్‌ సకారి ముందంజ వేసింది.

Published : 02 Jul 2024 03:46 IST

రెండో రౌండ్లో మెద్వెదెవ్, రూడ్‌
వింబుల్డన్‌  
లండన్‌

మూడో సీడ్‌ అల్కరాస్‌ వింబుల్డన్‌లో శుభారంభం చేశాడు. అయిదోసీడ్‌ మెద్వెదెవ్, ఎనిమిదో సీడ్‌ రూడ్‌ కూడా రెండో రౌండ్లో ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌లో తొమ్మిదో సీడ్‌ సకారి ముందంజ వేసింది.

కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) వింబుల్డన్‌ రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. సోమవారం తొలి రౌండ్లో అతడు 7-6 (7-1), 7-5, 6-2తో లజల్‌ (ఎస్తోనియా)పై విజయం సాధించాడు. మ్యాచ్‌లో అల్కరాస్‌ నాలుగు ఏస్‌లు, 44 విన్నర్లు కొట్టాడు. డేనియల్‌ మెద్వెదెవ్‌ (రష్యా) కూడా శుభారంభం చేశాడు. మొదటి రౌండ్లో అతడు 6-3, 6-4, 6-2తో అలెగ్జాండర్‌ కొవసెవిచ్‌ (సెర్బియా)న ఓడించాడు. పదునైన సర్వీసులు చేసిన మెద్వెదెవ్‌.. 16 ఏస్‌లు సంధించాడు. 33 విన్నర్లు కొట్టాడు. 17 అనవసర తప్పిదాలే చేశాడు. 4 డబుల్‌ ఫాల్ట్‌లు, 32 అనవసర తప్పిదాలతో కొవసెవిచ్‌ మూల్యం చెల్లించుకున్నాడు. ఎనిమిదో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే), దిమిత్రోవ్‌ (బల్గేరియా) బోణీ కొట్టారు. రూడ్‌ 7-6 (7-2), 6-4, 6-4తో బోల్ట్‌ (ఆస్ట్రేలియా)ను మట్టికరిపించాడు. మ్యాచ్‌లో రూడ్‌ 18 ఏస్‌లు, 45 విన్నర్లు కొట్టాడు. దిమిత్రోవ్‌ (బల్గేరియా) 6-3, 6-4, 7-5తో లజోవిచ్‌ (సెర్బియా)పై గెలిచాడు. దిమిత్రోవ్‌ 16 ఏస్‌లు కొట్టాడు. ఇతర మ్యాచ్‌ల్లో వావ్రింకా (స్విట్జర్లాండ్‌) 6-3, 7-5, 6-4తో బ్రూమ్‌ (బ్రిటన్‌)పై, జాంగ్‌ (చైనా) 7-6 (7-4), 6-3, 6-2తో జాన్వీర్‌ (ఫ్రాన్స్‌)పై, ముల్లర్‌ (ఫ్రాన్స్‌) 6-4, 7-6 (7-2), 7-6 (7-5)తో గ్యాస్టన్‌ (ఫ్రాన్స్‌)పై, బెరెటిని (ఇటలీ) 7-6 (7-3), 6-2, 3-6, 6-1తో ఫస్కోవిక్స్‌ (హంగేరి)పై, తియోఫె (అమెరికా) 6-7 (1-7), 2-6, 6-1, 6-3, 6-3తో అర్నాల్ది (ఇటలీ)పై నెగ్గారు. మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌), ఫోగ్నిని (ఇటలీ), నకషిమ (అమెరికా) కూడా ముందంజ వేశారు.

ఒసాకా ముందుకు: మహిళల సింగిల్స్‌లో ఒసాకా (జపాన్‌) రెండో రౌండ్లో ప్రవేశించింది. మొదటి రౌండ్లో ఆమె 6-1, 1-6, 6-4తో పారీ (ఫ్రాన్స్‌)పై గెలిచింది. ఒసాకా ఈ మ్యాచ్‌లో అయిదు ఏస్‌లు, 34 విన్నర్లు కొట్టింది. 9వ సీడ్‌ సకారి (గ్రీస్‌) శుభారంభం చేసింది. ఆరంభ రౌండ్లో ఆమె 6-3, 6-1తో కెస్లెర్‌ (అమెరికా)ను చిత్తు చేసింది. ఇతర మ్యాచ్‌ల్లో కసట్కినా (రష్యా) 6-3, 6-4తో షుయ్‌ జాంగ్‌ (చైనా)పై, కోస్త్యుక్‌ (ఉక్రెయిన్‌) 6-3, 6-తో స్రంకోవా (సెర్బియా)పై, గ్రచేవా (ఫ్రాన్స్‌) 6-3, 6-1తో సురెంకో (ఉక్రెయిన్‌)పై, వాంగ్‌ (చైనా) 6-0, 3-6, 6-4తో ష్మీద్లోవా (సెర్బియా)పై గెలిచారు. మ్యాడిసన్‌ కీస్‌ (అమెరికా), మెర్టెన్స్‌ (జర్మనీ), బురెల్‌ (ఫ్రాన్స్‌), దనిలోవిచ్‌ (సెర్బియా), పౌలిని (ఇటలీ), పవ్లిచెంకోవా (రష్యా) ముందంజ వేశారు. ప్లిస్కోవా (చెక్‌) 6-4, 4-6, 5-7తో ష్నైదర్‌ (రష్యా) చేతిలో ఓడిపోయింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని