గుకేశ్‌ పోరు సింగపూర్‌లో

సొంతగడ్డపై డింగ్‌ లిరెన్‌ (చైనా)తో ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ మ్యాచ్‌ ఆడాలనుకున్న దొమ్మరాజు గుకేశ్‌ ఆశలు ఫలించలేదు.

Published : 02 Jul 2024 03:42 IST

లిరెన్‌తో ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ మ్యాచ్‌ 

దిల్లీ: సొంతగడ్డపై డింగ్‌ లిరెన్‌ (చైనా)తో ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ మ్యాచ్‌ ఆడాలనుకున్న దొమ్మరాజు గుకేశ్‌ ఆశలు ఫలించలేదు. చెన్నై లేదా దిల్లీలో ఈ ఛాంపియన్‌షిప్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వాలని భారత్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ మెగా పోరును నిర్వహించే అవకాశాన్ని సింగపూర్‌ పట్టేసింది. నవంబర్‌ 20-డిసెంబర్‌ 15 తేదీల్లో జరగబోయే ఈ సమరానికి ఫిడే రూ.20 కోట్లు నగదు బహుమతిగా నిర్ణయించింది. ‘‘ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి పోటీపడిన దేశాల్లో వేదికలను పరిశీలించాం. సౌకర్యాలను గమనించాం. సింగపూర్‌కు ఆతిథ్య హక్కులను ఇస్తున్నాం’’ అని ఫిడే తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో క్యాండిడేట్‌ చెస్‌ టైటిల్‌ గెలిచిన 17 ఏళ్ల గుకేశ్‌.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ లిరెన్‌తో ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లో తలపడేందుకు అర్హత సాధించాడు. ఈ మ్యాచ్‌ ఆడబోతున్న పిన్న వయస్కుడిగా కూడా నిలిచాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని