- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Rahul Dravid: ఆ ఒక్కటీ కొట్టండి.. కోహ్లీకి ఓ బాధ్యత అప్పగించిన ద్రవిడ్
కోచ్‌గా ఇన్నింగ్స్‌ను ముగించిన రాహుల్ ద్రవిడ్.. ఆఖరి రోజు కూడా విధులను నిర్వర్తించాడు. వెళ్తూ వెళ్తూ కోహ్లీకి ఓ బాధ్యతను అప్పగించాడు.
బ్రిడ్జ్‌టౌన్: కోచ్‌గా ఇన్నింగ్స్‌ను ముగించిన రాహుల్ ద్రవిడ్.. ఆఖరి రోజు కూడా విధులను నిర్వర్తించాడు. వెళ్తూ వెళ్తూ కోహ్లీకి ఓ బాధ్యతను అప్పగించాడు. టెస్టుల్లోనూ టీమ్ఇండియా ఛాంపియన్‌గా నిలవాలని అన్నాడు. ‘‘తెల్లబంతితో ఆ మూడూ మనం సాధించాం. ఇక ఎరుపే ఉంది. అది కూడా సాధించండి’’ అని డ్రెస్సింగ్‌రూమ్‌లో కోహ్లితో ద్రవిడ్ చెప్పాడు. ఈ వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
ద్రవిడ్ దృష్టిలో మూడు అంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మూడు ప్రపంచ ట్రోఫీలు అన్నమాట. ఒకటి టీ20 ప్రపంచకప్, రెండోది వన్డే ప్రపంచకప్.. మూడోది ఛాంపియన్స్ ట్రోఫీ. ఆటగాడిగా కోహ్లి ఈ మూడూ గెలిచాడు. ఇక మిగిలింది ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్పే. భారత జట్టు రెండు సార్లు.. 2021, 2023లో డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్ గెలిచాక కోహ్లి అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. టీమ్ఇండియా ప్రస్తుతం తుపాను కారణంగా బార్బడోస్‌లో చిక్కుకుపోయింది. జట్టు ప్రత్యేక విమానంలో భారత్‌కు రానున్నట్లు సమాచారం. సహాయ సిబ్బంది, కుటుంబాలు, అధికారులు సహా భారత బృందంతో మొత్తం 70 మంది సభ్యులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిద్రపోయి.. భారత్ మ్యాచ్‌కు దూరమై..
వరల్డ్ కప్‌లో మ్యాచ్ ఆడేందుకు ప్రతి ఆటగాడూ ఉత్సాహం చూపిస్తాడు. ఇక పెద్ద జట్టుతో మ్యాచ్ అంటే సిద్ధంగా ఉంటారు. కానీ, బంగ్లాదేశ్ బౌలర్ మాత్రం అతి నిద్రతో తుది జట్టులో స్థానం కోల్పోయాడు. -
వందలో మరో చిరుత.. ఉసేన్ బోల్ట్‌ను గుర్తుచేస్తూ..
100 మీటర్ల పరుగు అనగానే ఉసేన్ బోల్ట్ గుర్తొస్తాడు! అతడి అనితర సాధ్యమైన రికార్డులు గుర్తొస్తాయి. తన ఆటతో హవభావాలతో స్ప్రింట్‌కు అతడు తెచ్చిన క్రేజ్ అలాంటిది. బోల్ట్ రిటైరై ఏడేళ్లయినా అతడిలా పరుగులో ఆధిపత్యం చెలాయించే మరో వీరుడు రాలేదు. -
ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్
గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత తాను టీమ్ండియా కోచ్‌గా తప్పుకోవాలని అనుకున్నానని, కానీ కెప్టెన్ రోహిత్ శర్మ తనను ఆపాడని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. -
రోహిత్ వారసుడెవరు?
ఎన్నో ఏళ్ల కల తీరింది. ఎట్టకేలకు భారత్ ఒక ఐసీసీ ట్రోఫీ అందుకుంది. 2007లో పొట్టి కప్పు మొదలైనపుడు అందుకున్న టైటిల్.. మళ్లీ ఇప్పుడు భారత్ చేతికి చిక్కింది. ఈ విజయంతో ఎంతో సంతృప్తిగా టీ20లకు గుడ్‌బై చెప్పాడు రోహిత్ శర్మ. -
అంతా కలలాగే..
టీ20 ప్రపంచకప్ గెలవడం కలలాగే అనిపిస్తోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ విజయం తాలూకు అనుభూతులను మరి కొంత కాలం ఆస్వాదిస్తూనే ఉండాలనిపిస్తోందని అతను చెప్పాడు. -
వింబుల్డన్ ఛాంపియన్‌కు చెక్
వింబుల్డన్ ఆరంభంలోనే షాక్! మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ వొండ్రుసోవా (రష్యా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. స్పెయిన్ అన్‌సీడెడ్ జెస్సికా బౌజాస్ 6-4, 6-2తో వరుస సెట్లలో ఆరోసీడ్ వొండ్రుసోవా ఆట కట్టించింది. -
క్వార్టర్స్‌లో ఫ్రాన్స్
ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లు యూరో 2024 క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాయి. మరోసారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినప్పటికీ నాకౌట్ మ్యాచ్ (రౌండ్ ఆఫ్ 16)లో ఫ్రాన్స్ 1-0తో బెల్జియంపై విజయం సాధించింది. -
భారత జట్టులో సాయి, జితేష్
యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలకు సెలెక్టర్ల నుంచి పిలుపొచ్చింది. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన సంజు శాంసన్, శివమ్ దూబె, యశస్వి జైస్వాల్ స్థానంలో తొలి రెండు మ్యాచ్‌లకు ఈ ముగ్గురికి భారత జట్టులో చోటు కల్పించారు. -
పారిస్ ఒలింపిక్స్‌లో జ్యోతి!
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి ఒలింపిక్స్ 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీ పడనున్న తొలి భారత అథ్లెట్‌గా రికార్డులకెక్కనుంది! ర్యాంకింగ్ కోటాలో జ్యోతి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.