ఆర్సీబీతోనే కార్తీక్‌.. కానీ కొత్తగా

వచ్చే ఏడాది ఐపీఎల్‌లోనూ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జట్టుతో కలిసి దినేశ్‌ కార్తీక్‌ కనిపించనున్నాడు. అదేంటీ.. ఈ సీజన్‌ పూర్తి కాగానే అతను అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు కదా.

Published : 02 Jul 2024 03:40 IST

బెంగళూరు: వచ్చే ఏడాది ఐపీఎల్‌లోనూ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జట్టుతో కలిసి దినేశ్‌ కార్తీక్‌ కనిపించనున్నాడు. అదేంటీ.. ఈ సీజన్‌ పూర్తి కాగానే అతను అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు కదా.. రిటైర్మెంట్‌ నుంచి వెనక్కి వస్తున్నాడా? అనే సందేహం కలుగుతోందా! అతను ఆటకు దూరంగానే ఉన్నాడు. కానీ ఆర్సీబీతోనే ఉంటాడు. ఎందుకంటే ఆర్సీబీ జట్టుకు బ్యాటింగ్‌ కోచ్, మెంటార్‌గా అతను నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని సోమవారం ఆర్సీబీ ప్రకటించింది. ‘‘కొత్త అవతారంలో ఆర్సీబీలోకి దినేశ్‌ కార్తీక్‌ తిరిగొచ్చాడు. మా పురుషుల జట్టుకు అతను బ్యాటింగ్‌ కోచ్, మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. అతను క్రికెట్‌కు దూరమవొచ్చు కానీ అతని నుంచి క్రికెట్‌ను దూరం చేయలేం’’ అని ఆర్సీబీ ఎక్స్‌లో పోస్టు చేసింది. ‘‘ఫ్రొఫెషనల్‌ స్థాయిలో కోచింగ్‌ ఇవ్వబోతుండటం ఎంతో ఉత్తేజాన్నిస్తోంది. నా జీవితంలో ఈ కొత్త అధ్యాయనాన్ని తపనతో కొనసాగిస్తా. జట్టు వృద్ధికి నా అనుభవం పనికొస్తుందనే నమ్మకంతో ఉన్నా’’ అని దినేశ్‌ కార్తీక్‌ చెప్పాడు. ఐపీఎల్‌లో 257 మ్యాచ్‌లాడిన అతను 4,842 పరుగులు చేశాడు. టీమ్‌ఇండియా తరపున 94 వన్డేలు, 26 టెస్టులు, 60 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. ఆటలో కొనసాగుతున్నప్పుడే క్రికెట్‌ వ్యాఖ్యాతగానూ కార్తీక్‌ మారిన సంగతి తెలిసిందే.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని