నా కెరీర్‌ ముగించాలనే కుట్ర

జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా)లోని లోపాలు ఎత్తి చూపినందుకు తనను లక్ష్యంగా చేసుకున్నారని, రెజ్లింగ్‌లో కొనసాగకుండా కుట్రలు పన్నుతున్నారని భారత స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా ఆరోపించాడు.

Published : 02 Jul 2024 03:39 IST

దిల్లీ: జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా)లోని లోపాలు ఎత్తి చూపినందుకు తనను లక్ష్యంగా చేసుకున్నారని, రెజ్లింగ్‌లో కొనసాగకుండా కుట్రలు పన్నుతున్నారని భారత స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా ఆరోపించాడు. ఈ ఏడాది మార్చి 10న డోపింగ్‌ పరీక్ష కోసం నమూనాలు ఇవ్వడానికి బజ్‌రంగ్‌ నిరాకరించడంతో నాడా అతనిపై నిషేధం విధించింది. కానీ సరైన నోటీసులు ఇవ్వకుండా విధించిన ఈ నిషేధాన్ని డోపింగ్‌ నిరోధక క్రమశిక్షణ ప్యానెల్‌ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల నోటీసులు అందించి మరీ బజ్‌రంగ్‌ను నాడా మరోసారి సస్పెండ్‌ చేసింది. దీంతో నాడాపై బజ్‌రంగ్‌ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ‘‘నాడా నన్ను లక్ష్యంగా చేసుకుందని ఈ చర్యలతో స్పష్టమవుతోంది. నన్ను రెజ్లింగ్‌లో కొనసాగకుండా చేయాలని వాళ్లు అనుకుంటున్నారు. వాళ్ల దగ్గర సమాధానాలు లేవు. వాళ్ల తప్పులకు బాధ్యత తీసుకోవడం లేదు. కేవలం అథ్లెట్‌ను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. తమ లోపాలను ఎవరూ ప్రశ్నించకూడదని నాడా అనుకుంటోంది. ఎవరైనా అలా చేస్తే వాళ్లను లక్ష్యంగా చేసుకుంటోంది. వాళ్లను ఆటలో కొనసాగకుండా చేయాలని చూస్తోంది. నాడా అహంకారంపై పోరాటం చేస్తా. మా న్యాయవాది త్వరలోనే బదులిస్తాడు’’ అని బజ్‌రంగ్‌ సోమవారం ఎక్స్‌లో పోస్టు చేశాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని