శ్రీలంకతో సిరీస్‌లో కొత్త కోచ్‌ బాధ్యతలు

శ్రీలంకతో సిరీస్‌లో భారత జట్టు కొత్త చీఫ్‌ కోచ్‌ బాధ్యతలు స్వీకరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. ఈ నెలలో జింబాబ్వే పర్యటనకు వీవీఎస్‌ లక్ష్మణ్‌ చీఫ్‌ కోచ్‌గా వ్యవహరిస్తాడని చెప్పాడు.

Published : 02 Jul 2024 03:37 IST

బ్రిడ్జ్‌టౌన్‌: శ్రీలంకతో సిరీస్‌లో భారత జట్టు కొత్త చీఫ్‌ కోచ్‌ బాధ్యతలు స్వీకరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. ఈ నెలలో జింబాబ్వే పర్యటనకు వీవీఎస్‌ లక్ష్మణ్‌ చీఫ్‌ కోచ్‌గా వ్యవహరిస్తాడని చెప్పాడు. కోచ్‌ పదవికి ఇప్పటికే ఇంటర్వ్యూలు నిర్వహించిన క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ).. గంభీర్, డబ్ల్యూవీ రామన్‌ పేర్లతో జాబితాను రూపొందించింది. ‘‘త్వరలోనే కోచ్, సెలెక్టర్ల నియామకం ఉంటుంది. సీఏసీ ఇద్దరి పేర్లతో జాబితా తయారు చేసింది. వారి సూచన మేరకు నిర్ణయం తీసుకుంటాం. శ్రీలంకతో సిరీస్‌లో కొత్త కోచ్‌ బాధ్యతలు స్వీకరిస్తాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్, ఛాంపియన్స్‌ ట్రోఫీలను లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. సీనియర్లంతా ఆడతారు. టీ20ల్లో రోహిత్‌ వారసుడు ఎవరన్నది సెలెక్టర్లు నిర్ణయిస్తారు. వాళ్లతో చర్చించాక నిర్ణయం ప్రకటిస్తాం’’ అని జై షా వివరించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని