పారిస్‌ డైమైండ్‌ లీగ్‌ నుంచి నీరజ్‌ ఔట్‌

ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్‌ జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా పారిస్‌ డైమండ్‌ లీగ్‌కు దూరమయ్యాడు. చిన్న గాయంతో ఇబ్బందిపడుతుండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు చెప్పాడు.

Published : 02 Jul 2024 03:37 IST

దిల్లీ: ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్‌ జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా పారిస్‌ డైమండ్‌ లీగ్‌కు దూరమయ్యాడు. చిన్న గాయంతో ఇబ్బందిపడుతుండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు చెప్పాడు. ఆరోగ్యం అన్నింటికన్నా ముఖ్యమని నీరజ్‌ అన్నాడు. నీరజ్‌ గత నెలలో పావో నుర్మి గేమ్స్‌లో 85.97 మీటర్ల త్రో తో విజేతగా నిలిచాడు. ‘‘అక్కడ నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. కానీ ఇంకా చేయాల్సింది ఉంది. నా పరుగు కాస్త నెమ్మదిగా ఉంది. మళ్లీ నా సహజ వేగాన్ని అందుకోవాలనుకుంటున్నా. అలా జరగాలి అంటే.. నేను పూర్తి ఫిట్‌గా ఉన్నానన్న నమ్మకం నాకు కలగాలి. ఆత్మవిశ్వాసంతో రన్‌వేపై పరుగెత్తాలనుకుంటున్నా’’ అని నీరజ్‌ చెప్పాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని