కోర్టులోనే కుప్పకూలిన 17 ఏళ్ల షట్లర్‌

ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఆడుతూనే కోర్టులో కుప్పకూలిన 17 ఏళ్ల చైనా షట్లర్‌ జాంగ్‌ జిజీ మరణంపై భారత స్టార్‌ పీవీ సింధు తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

Updated : 02 Jul 2024 11:59 IST

దిల్లీ: ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఆడుతూనే కోర్టులో కుప్పకూలిన 17 ఏళ్ల చైనా షట్లర్‌ జాంగ్‌ జిజీ మరణంపై భారత స్టార్‌ పీవీ సింధు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ వార్తతో తన హృదయం ముక్కలైందని ఆమె తెలిపింది. ‘‘బ్యాడ్మింటన్‌ యువ ఆటగాడు ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌ సందర్భంగా మరణించాడనే వార్తతో నా హృదయం ముక్కలైంది. ఈ కష్ట కాలంలో జాంగ్‌ కుటుంబానికి తీవ్రమైన సానుభూతి వ్యక్తం చేస్తున్నా. ఓ అద్భుతమైన ప్రతిభను ప్రపంచం కోల్పోయింది’’ అని ఎక్స్‌లో సింధు పోస్టు చేసింది. ఆదివారం రాత్రి జపాన్‌ ఆటగాడు కజుమాతో సింగిల్స్‌లో జాంగ్‌ తలపడ్డాడు. తొలి గేమ్‌లో స్కోరు 11-11తో ఉండగా అస్వస్థత కారణంగా జాంగ్‌ కోర్టులో కుప్పకూలాడు. వెంటనే అతనికి ప్రథమ చికిత్స అందించి, అంబులెన్స్‌లో దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు