జకోవిచ్‌ సాధిస్తాడా?

సెర్బియా దిగ్గజ టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌కు పరీక్ష. గాయంతో ఫ్రెంచ్‌ ఓపెన్లో క్వార్టర్‌ఫైనల్లోనే వైదొలిగిన అతడు సోమవారం ఆరంభమయ్యే ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ టోర్నీలో బరిలో దిగబోతున్నాడు.

Published : 01 Jul 2024 04:14 IST

నేటి నుంచే వింబుల్డన్‌

లండన్‌: సెర్బియా దిగ్గజ టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌కు పరీక్ష. గాయంతో ఫ్రెంచ్‌ ఓపెన్లో క్వార్టర్‌ఫైనల్లోనే వైదొలిగిన అతడు సోమవారం ఆరంభమయ్యే ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ టోర్నీలో బరిలో దిగబోతున్నాడు. అయితే పూర్తి ఫిట్‌నెస్‌ సాధించనట్లుగా కనిపిస్తున్న 37 ఏళ్ల నొవాక్‌ ఈ టోర్నీలో ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరం. ఈ ఏడుసార్లు ఛాంపియన్‌కు టాప్‌సీడ్‌ సినర్‌ (ఇటలీ), మూడోసీడ్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) నుంచి గట్టిపోటీ ఎదురు కానుంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో కాప్రివా (చెక్‌)తో రెండోసీడ్‌ జకో పోటీపడుతున్నాడు. రఫెల్‌ నాదల్‌ గాయంతో ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. భారత స్టార్‌ సుమిత్‌ నగాల్‌ తొలి రౌండ్లో కెక్‌మనోవిచ్‌ (సెర్బియా)తో పోటీపడుతున్నాడు. ఇటీవలే ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గిన స్వైటెక్‌.. మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌గా, ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. సబలెంక (బెలారస్‌), సకారి (గ్రీస్‌), కెర్బర్‌ (జర్మనీ) కూడా టైటిల్‌ రేసులో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని