స్నేహ్‌కు 8 వికెట్లు

భారత మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టులో దక్షిణాఫ్రికా పోరాడుతోంది. ఆఫ్‌ స్పిన్నర్‌ స్నేహ్‌ రాణా (8/77) విజృంభణతో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా.. 84.3 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది.

Published : 01 Jul 2024 04:12 IST

భారత్‌తో ఏకైక టెస్టులో పోరాడుతున్న దక్షిణాఫ్రికా

చెన్నై: భారత మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టులో దక్షిణాఫ్రికా పోరాడుతోంది. ఆఫ్‌ స్పిన్నర్‌ స్నేహ్‌ రాణా (8/77) విజృంభణతో తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా.. 84.3 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 236/4తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆ జట్టు మరో 30 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఫాలోఆన్‌లో పడ్డ దక్షిణాఫ్రికా.. మూడో రోజు ఆట చివరికి రెండో ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో రెండు వికెట్లకు 232 పరుగులు సాధించింది. సునె లుస్‌ (109; 203 బంతుల్లో 18×4), లారా వోల్వార్డ్‌ (93 బ్యాటింగ్‌; 252 బంతుల్లో 12×4) సత్తా చాటారు. సోమవారం మ్యాచ్‌కు చివరి రోజు కాగా.. సఫారీ జట్టు ఇన్నింగ్స్‌ ఓటమి తప్పించుకోవాలంటే మరో 105 పరుగులు చేయాలి.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 603/6 డిక్లేర్డ్‌ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 266 (కాప్‌ 74, స్నేహ్‌ రాణా 8/77)

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: 232/2 (లారా 93 బ్యాటింగ్, లుస్‌ 109, దీప్తిశర్మ 1/56)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని