వీళ్లకు వీడ్కోలు!

మునుపెన్నడూ లేని విధంగా అలరించిన టీ20 ప్రపంచకప్‌ ముగిసింది. ఈ పొట్టి కప్‌తోనే టీ20ల్లో కొంతమంది ఆటగాళ్ల కెరీర్‌ కూడా ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఫార్మాట్లో వీళ్లు 2026లో జరిగే తర్వాతి ప్రపంచకప్‌ ఆడటం అనుమానమే.

Published : 30 Jun 2024 03:30 IST

మునుపెన్నడూ లేని విధంగా అలరించిన టీ20 ప్రపంచకప్‌ ముగిసింది. ఈ పొట్టి కప్‌తోనే టీ20ల్లో కొంతమంది ఆటగాళ్ల కెరీర్‌ కూడా ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఫార్మాట్లో వీళ్లు 2026లో జరిగే తర్వాతి ప్రపంచకప్‌ ఆడటం అనుమానమే. ఇప్పటికే ఆస్ట్రేలియా ఓపెనర్‌ వార్నర్‌.. టీ20లకూ వీడ్కోలు పలికాడు. కోహ్లి, రోహిత్‌ కూడా పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. చివరి ప్రపంచకప్‌ ఆడేశానని న్యూజిలాండ్‌ పేసర్‌ బౌల్ట్‌ కూడా తెలిపాడు. నమీబియా ఆల్‌రౌండర్‌ డేవిడ్‌ వీజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. నిజానికి ఈ ప్రపంచకప్‌కు కోహ్లి, రోహిత్‌ ఎంపికపై మొదట సందేహాలు వ్యక్తమయ్యాయి. 2022 టీ20 ప్రపంచకప్‌ తర్వాత వీళ్లు భారత టీ20 జట్టుకు దూరంగా ఉండటమే కారణం. కానీ చివరిగా ఈ టోర్నీలో ఆడే అవకాశం దక్కింది. మరోవైపు 37 ఏళ్ల షకిబుల్‌ హసన్‌ (బంగ్లాదేశ్‌), 36 ఏళ్ల రసెల్‌ (వెస్టిండీస్‌), 34 ఏళ్ల స్టార్క్‌ (ఆస్ట్రేలియా), 39 ఏళ్ల మహమ్మద్‌ నబి (అఫ్గానిస్థాన్‌), 37 ఏళ్ల మొయిన్‌ అలీ (ఇంగ్లాండ్‌) తదితర సీనియర్‌ ఆటగాళ్లు కూడా వచ్చే టీ20 ప్రపంచకప్‌లో ఆడటం సందేహంగా కనిపిస్తోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని