గుకేశ్, ప్రజ్ఞానంద గేమ్‌లు డ్రా

గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో భాగంగా జరుగుతున్న సూపర్‌బెట్‌ క్లాసిక్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్లు గుకేశ్, ప్రజ్ఞానందకు డ్రాలు ఎదురయ్యాయి.

Published : 29 Jun 2024 03:00 IST

బుకారెస్ట్‌ (రొమేనియా): గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో భాగంగా జరుగుతున్న సూపర్‌బెట్‌ క్లాసిక్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్లు గుకేశ్, ప్రజ్ఞానందకు డ్రాలు ఎదురయ్యాయి. శుక్రవారం జరిగిన రెండో రౌండ్లో ఇయాన్‌ నెపోమ్నియాచి (1- రష్యా)తో గుకేశ్‌ (1.5), మాక్సిమ్‌ వాషీర్‌ లాగ్రేవ్‌ (1- ఫ్రాన్స్‌)తో ప్రజ్ఞానంద (1) డ్రా చేసుకున్నారు. రెండు రౌండ్ల అనంతరం గుకేశ్, ఫాబియానో కరువానా (అమెరికా) ఒకటిన్నర పాయింట్లతో సంయుక్తంగా ఆధిక్యంలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని