డోపింగ్‌ వలలో మను

జావెలిన్‌ త్రోయర్‌ డి.పి.మను డోపింగ్‌ వలలో చిక్కుకున్నాడు. జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) సూచనల మేరకు అంతర్‌ రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌కు దూరంగా ఉండాలంటూ మనును భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) శుక్రవారం ఆదేశించింది.

Updated : 29 Jun 2024 02:57 IST

పంచకుల (హరియాణా): జావెలిన్‌ త్రోయర్‌ డి.పి.మను డోపింగ్‌ వలలో చిక్కుకున్నాడు. జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) సూచనల మేరకు అంతర్‌ రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌కు దూరంగా ఉండాలంటూ మనును భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) శుక్రవారం ఆదేశించింది. 2023 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన మను.. ప్రపంచ ర్యాంకింగ్‌ కోటా ప్రకారం పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం లాంఛనమే. అయితే తాజా పరిణామంతో అతను ఒలింపిక్స్‌ బెర్తు కోల్పోయే అవకాశముంది. నిజానికి గురువారం ప్రారంభమైన జాతీయ అంతర్‌ రాష్ట్ర పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల జాబితాలో మను పేరు కూడా ఉంది. సవరించిన జాబితా నుంచి అతని పేరును తప్పించారు. ‘‘డోపింగ్‌కు సంబంధించి ఉండొచ్చు. అసలు విషయమేంటో మాకింకా తెలియదు. మనును పోటీలకు దూరంగా ఉంచాలంటూ గురువారం నాడా నుంచి ఏఎఫ్‌ఐ కార్యాలయానికి ఫోన్‌ వచ్చింది. నాడా నుంచి కచ్చితమైన సమాచారం తెలుసుకునేందుకు మను కూడా ప్రయత్నిస్తున్నాడు’’ అని ఏఎఫ్‌ఐ అధ్యక్షుడు ఆదిల్‌ సుమరివాలా తెలిపాడు.


క్వార్టర్స్‌లో గాయత్రి- ట్రీసా జోడీ 

ఫోర్ట్‌ వర్త్‌ (అమెరికా): యూఎస్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి జోడీ గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి- ట్రీసా జోడీ 16-21, 21-11, 21-19తో సీ షాన్‌- హంగ్‌ జు (చైనీస్‌ తైపీ) జంటపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్‌ 21-18, 21-16తో హువాంగ్‌ కాయ్‌ (చైనీస్‌ తైపీ)పై నెగ్గి క్వార్టర్స్‌ చేరుకున్నాడు. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో మాళవిక బాన్సోద్‌ 15-21, 21-19, 21-14తో తెరెజా స్వబికోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలుపొందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని