కౌంటీల్లో రహానె

టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాటర్‌ అజింక్య రహానె మరోసారి ఇంగ్లాండ్‌ కౌంటీల్లో ఆడబోతున్నాడు. ఈ సీజన్‌ కోసం అతనితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు లీసెస్టర్‌షైర్‌ క్లబ్‌ గురువారం ప్రకటించింది.

Published : 28 Jun 2024 03:37 IST

లీసెస్టర్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ బ్యాటర్‌ అజింక్య రహానె మరోసారి ఇంగ్లాండ్‌ కౌంటీల్లో ఆడబోతున్నాడు. ఈ సీజన్‌ కోసం అతనితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు లీసెస్టర్‌షైర్‌ క్లబ్‌ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో మిగతా 5 మ్యాచ్‌లు, వన్డే కప్‌లో ఆ జట్టు తరపున రహానె ఆడనున్నాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికా ఆటగాడు మల్దర్‌ వెళ్లిపోయే అవకాశం ఉండటంతో అతని స్థానంలో జట్టు రహానెను తీసుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని