గుకేశ్‌ శుభారంభం

సూపర్‌బెట్‌ క్లాసిక్‌ చెస్‌ టోర్నమెంట్లో భారత స్టార్‌ దొమ్మరాజు గుకేశ్‌ శుభారంభం చేశాడు. గురువారం తొలి రౌండ్లో బోగ్డాన్‌ డానియల్‌ (రొమేనియా)పై అతడు విజయం సాధించాడు.

Published : 28 Jun 2024 03:35 IST

బుకారెస్ట్‌ (రొమేనియా): సూపర్‌బెట్‌ క్లాసిక్‌ చెస్‌ టోర్నమెంట్లో భారత స్టార్‌ దొమ్మరాజు గుకేశ్‌ శుభారంభం చేశాడు. గురువారం తొలి రౌండ్లో బోగ్డాన్‌ డానియల్‌ (రొమేనియా)పై అతడు విజయం సాధించాడు. మరో గేమ్‌లో నొదిర్‌బెక్‌ (ఉజ్బెకిస్థాన్‌)తో మరో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు. ఇంకో గేమ్‌లో అలీరెజా (ఫ్రాన్స్‌)పై ఫాబియానో కరువానా (అమెరికా) విజయం సాధించాడు. మాక్సిమ్‌ లాగ్రెవ్‌ (ఫ్రాన్స్‌)-ఇయాన్‌ నిపోమ్నిషి (రష్యా), అనీష్‌ గిరి (నెదర్లాండ్స్‌)-వెస్లీ సో (అమెరికా) మధ్య గేమ్‌లు డ్రా అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని