క్వార్టర్స్‌లో అర్జెంటీనా

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా జట్టు కోపా అమెరికాలో క్వార్టర్‌ఫైనల్‌ స్థానాన్ని ఖాయం చేసుకుంది. గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో ఆ జట్టు 1-0తో చిలీపై విజయం సాధించింది.

Published : 27 Jun 2024 01:52 IST

ఈస్ట్‌ రూథర్‌ఫోర్డ్‌ (అమెరికా): డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా జట్టు కోపా అమెరికాలో క్వార్టర్‌ఫైనల్‌ స్థానాన్ని ఖాయం చేసుకుంది. గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో ఆ జట్టు 1-0తో చిలీపై విజయం సాధించింది. 88వ నిమిషంలో మార్టినెజ్‌ గోల్‌తో అర్జెంటీనా ఆధిక్యంలోకి వెళ్లింది. మెస్సి కార్నర్‌ కిక్‌ను చిలీ గోల్‌కీపర్‌ అడ్డుకోగా.. వెనక్కి వచ్చిన బంతిని మార్టినెజ్‌ నెట్లోకి కొట్టాడు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన అర్జెంటీనా.. ఆరు పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది. అర్జెంటీనా తన ఆఖరి గ్రూప్‌ మ్యాచ్‌లో శనివారం పెరూతో తలపడుతుంది.  మరో మ్యాచ్‌లో కెనడా 1-0తో పెరూను ఓడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని