హర్మన్‌ సారథ్యంలో ఒలింపిక్స్‌కు

పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టుకు హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యం వహించనున్నాడు.

Updated : 27 Jun 2024 06:04 IST

దిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టుకు హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యం వహించనున్నాడు. వచ్చే నెల ఆరంభంకానున్న ఒలింపిక్స్‌ కోసం 16 మంది ఆటగాళ్లతో భారత జట్టును హాకీ ఇండియా బుధవారం ప్రకటించింది. హార్దిక్‌ సింగ్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. వెటరన్‌ గోల్‌ కీపర్‌ పి.ఆర్‌.శ్రీజేష్, మిడ్‌ ఫీల్డర్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌కు తమ కెరీర్‌లో ఇవి నాలుగో ఒలింపిక్స్‌ కాగా.. హర్మన్‌ప్రీత్‌కు మూడోది. 2020 ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన భారత్‌.. పారిస్‌ క్రీడల్లో పూల్‌-బిలో ఆడనుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బెల్జియం, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐర్లాండ్‌ ఇదే పూల్‌లో ఉన్నాయి. పూల్‌-ఎలో నెదర్లాండ్స్, జర్మనీ, ఇంగ్లాండ్, స్పెయిన్, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్‌ పోటీపడనున్నాయి. 

భారత జట్టు: గోల్‌ కీపర్‌: శ్రీజేష్, డిఫెండర్లు: జర్మన్‌ప్రీత్, అమిత్‌ రోహిదాస్, హర్మన్‌ప్రీత్, సుమిత్, సంజయ్, మిడ్‌ ఫీల్డర్లు: రాజ్‌కుమార్, షంషేర్‌ సింగ్, మన్‌ప్రీత్, హార్దిక్, వివేక్‌ సాగర్‌ ప్రసాద్, ఫార్వర్డ్‌లు: అభిషేక్, సుఖ్‌జీత్, లలిత్‌కుమార్‌ ఉపాధ్యాయ్, మన్‌దీప్‌ సింగ్, గుర్జంత్‌ సింగ్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని