నాకౌట్స్‌లో ఇటలీ

ఇటలీ జట్టు యూరో ఛాంపియన్‌షిప్‌ నాకౌట్స్‌లో అడుగుపెట్టింది. క్రొయేషియాతో జరిగిన గ్రూప్‌-బి మ్యాచ్‌ను ఆ జట్టు 1-1తో డ్రాగా ముగించింది. 55వ నిమిషంలో మోద్రిచ్‌ కొట్టిన గోల్‌తో క్రొయేషియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Published : 26 Jun 2024 02:10 IST

క్రొయేషియాతో మ్యాచ్‌ డ్రా 

లీప్‌జిగ్‌ (జర్మనీ): ఇటలీ జట్టు యూరో ఛాంపియన్‌షిప్‌ నాకౌట్స్‌లో అడుగుపెట్టింది. క్రొయేషియాతో జరిగిన గ్రూప్‌-బి మ్యాచ్‌ను ఆ జట్టు 1-1తో డ్రాగా ముగించింది. 55వ నిమిషంలో మోద్రిచ్‌ కొట్టిన గోల్‌తో క్రొయేషియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. స్టాపేజ్‌ టైమ్‌లో జకాని (90+8) గోల్‌తో ఇటలీ స్కోరు సమం చేసింది. గ్రూప్‌ నుంచి రన్నరప్‌గా ఇటలీ ముందంజ వేసింది. ఇటలీ ఈ నెల 29న జరిగే మ్యాచ్‌ (రౌండ్‌ ఆఫ్‌ 16)లో స్విట్జర్లాండ్‌ను ఢీకొంటుంది. మరోవైపు 1-0తో అల్బేరియాపై గెలిచిన స్పెయిన్‌ గ్రూప్‌-బిలో అగ్రస్థానంలో నిలిచింది. 

బ్రెజిల్, కోస్టారికా మ్యాచ్‌ డ్రా: కోపా అమెరికాలో కోస్టారికా 0-0తో బ్రెజిల్‌ను నిలువరించింది. ఈ గ్రూప్‌-డి మ్యాచ్‌లో బ్రెజిల్‌ చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కోస్టారికా డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. కోస్టారియా గోల్‌కీపర్‌ ప్యాట్రిక్‌ సిక్వేరా మూడు సేవ్‌లు చేశాడు. ఇదే గ్రూపులో జరిగిన మరో మ్యాచ్‌లో కొలంబియా 2-1తో పరాగ్వేను ఓడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని