పారిస్‌ ఒలింపిక్స్‌కు అనూష్‌

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత ఈక్వెస్ట్రియన్‌ ఆటగాడు అనూష్‌ అగర్వాలా బరిలో దిగనున్నాడు. భారత ఈక్వెస్ట్రియన్‌ సమాఖ్య సెలెక్షన్‌ ట్రయల్స్‌లో శ్రుతి వోరాపై పైచేయి సాధించిన అనూష్‌కు ఒలింపిక్స్‌ బెర్తు దక్కింది.

Published : 26 Jun 2024 02:07 IST

దిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత ఈక్వెస్ట్రియన్‌ ఆటగాడు అనూష్‌ అగర్వాలా బరిలో దిగనున్నాడు. భారత ఈక్వెస్ట్రియన్‌ సమాఖ్య సెలెక్షన్‌ ట్రయల్స్‌లో శ్రుతి వోరాపై పైచేయి సాధించిన అనూష్‌కు ఒలింపిక్స్‌ బెర్తు దక్కింది. 2022 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో అనూష్‌.. టీమ్‌ విభాగంలో స్వర్ణం, వ్యక్తిగత కేటగిరీలో కాంస్య పతకాలు సాధించాడు.

జూడోకా తులిక మాన్‌కు పారిస్‌ ఒలింపిక్‌ కోటా: కామన్వెల్త్‌ క్రీడల రజత పతక విజేత తులిక మాన్‌ భారత్‌ తరఫున జుడోలో పారిస్‌ ఒలింపిక్‌ కోటా సాధించింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన జూడోకాల వివరాలను అంతర్జాతీయ జూడో సమాఖ్య (ఐజేఎఫ్‌) మంగళవారం వెల్లడించింది. +78 కిలోల జాబితాలో తులిక పేరు ఉంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని