Indian wrestling: అవార్డులు వెనక్కిచ్చేసిన వినేశ్‌

స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ తన ఖేల్‌రత్న, అర్జున అవార్డులను శనివారం వెనక్కిచ్చేసింది. అవార్డులను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసేందుకు బయల్దేరిన ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో.. కర్తవ్య పథ్‌ వద్ద వాటిని వదిలేసింది.

Updated : 31 Dec 2023 10:30 IST

దిల్లీ: స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ తన ఖేల్‌రత్న, అర్జున అవార్డులను శనివారం వెనక్కిచ్చేసింది. అవార్డులను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసేందుకు బయల్దేరిన ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో.. కర్తవ్య పథ్‌ వద్ద వాటిని వదిలేసింది. పోలీసులు అవార్డులను స్వాధీనం చేసుకున్నారు. బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ సన్నిహితుడు సంజయ్‌ సింగ్‌ భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని నిరసిస్తూ.. అవార్డులను వదులుకుంటానని వినేశ్‌ ఇంతకుముందే ప్రకటించింది. నిబంధనలను పాటించనందుకు డబ్ల్యూఎఫ్‌ఐని క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. సమాఖ్యను నడిపించడానికి ఐఓఏ.. అడ్‌హక్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని