Rohit sharma: ఆటగాళ్లను అర్థం చేసుకోవడం కీలకం

జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు చెప్పేది వినడం.. వారిని అర్థం చేసుకోవడం చాలా కీలకమని భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌శర్మ అన్నాడు.

Updated : 27 Oct 2023 09:35 IST

దిల్లీ: జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు చెప్పేది వినడం.. వారిని అర్థం చేసుకోవడం చాలా కీలకమని భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌శర్మ అన్నాడు. వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ సారథ్యంపై ప్రశంసలు కురుస్తున్నాయి. నాయకుడి పాత్రను సమర్థంగా పోషిస్తూ జట్టులోని ప్రతి ఒక్కరి నుంచి మంచి ఫలితాలు రాబడుతున్నాడు. ‘‘ఆటగాళ్ల నిర్వహణ విషయంలో వ్యక్తిగతంగా ఒకొక్కరిని అర్థం చేసుకోవడం.. వారి అవసరాలు తెలుసుకోవడం అత్యంత కీలకం. వారి ఇష్టాయిష్టాలు కనుక్కోవాలి. టీమ్‌ గేమ్‌ అంటే ఒక్కరు, ఇద్దరు లేదా కొందరు కాదు.. జట్టులోని ప్రతి ఒక్కరూ భాగమే. ఛాంపియన్‌షిప్‌, పెద్ద టోర్నీలు గెలవాలంటే ప్రతి ఒక్కరు తమ పాత్ర పోషించాలి. అందుకోసం అందరినీ మానసికంగా అత్యుత్తమ స్థితిలో ఉంచాలి. ప్రతి ఒక్కరి మాట వినాలి.వారి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోవాలి. నేనెప్పుడూ అదే పనిచేస్తా’’ అని రోహిత్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని