Gujarat - Gill: చెన్నైతో మ్యాచ్‌.. గిల్‌ సహా గుజరాత్‌ టీమ్‌కు భారీ జరిమానా

గెలిచామనే ఆనందం గుజరాత్‌కు లేకుండా పోయింది. ఆ జట్టు సారథి గిల్‌తోపాటు ఆటగాళ్లకు భారీ జరిమానాను విధిస్తూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది.

Published : 11 May 2024 11:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై గుజరాత్‌ అద్భుత విజయం సాధించింది. దీంతో ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన ఆ జట్టుకు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ షాక్‌ ఇచ్చింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా గుజరాత్ కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్‌కు రూ. 24 లక్షల జరిమానాను విధిస్తూ ప్రకటన చేసింది. అలాగే జట్టులోని సభ్యులకూ మ్యాచ్‌ ఫీజ్‌లో 25 శాతం లేదా రూ. 6 లక్షల వరకు ఫైన్‌ వేసింది. ప్రస్తుత సీజన్‌లో గుజరాత్‌ రెండోసారి స్లో ఓవర్‌ రేట్‌కు పాల్పడటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చెన్నైపై విక్టరీతో పాయింట్ల పట్టికలో గుజరాత్ (10) ఎనిమిదో స్థానానికి చేరుకుంది. 

గిల్‌కు ఆ సత్తా ఉంది: గ్రేమ్‌ స్మిత్

చెన్నైపై సెంచరీ సాధించిన శుభ్‌మన్‌ గిల్.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచుల్లో 426 పరుగులు చేశాడు. గిల్ ఆట తీరుపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్‌ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘గిల్ సత్తా ఏంటో ఇప్పటికే నిరూపితమైంది. ప్రతి ఏడాది మెరుగ్గా రాణిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్‌ ఆరంభంలోనే కాస్త ఇబ్బంది పడినట్లు అనిపించాడు. కెప్టెన్‌గా తొలి ఏడాది కావడం కూడానూ అతడిపై ఒత్తిడి తెచ్చి ఉంటుంది. ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వస్తూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. జట్టును సమర్థంగా నడిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. నాయకత్వం, బ్యాటింగ్‌ను ఎలా సమతూకంగా నిర్వర్తించాలనే విషయాలను గిల్ త్వరగానే నేర్చుకుంటాడు. అతడి బ్యాటింగ్‌లోనూ టైమింగ్‌ అద్భుతంగా ఉంది. చెన్నైపై నలువైపులా షాట్లు కొట్టిన తీరు అభినందనీయం’’ అని స్మిత్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని