IND vs SA: ఫైనల్‌కు వర్షం ముప్పు.. రిజర్వ్‌డే నాడూ మ్యాచ్‌ జరగకపోతే.. నిబంధనలు ఎలా ఉన్నాయ్‌..?

ప్రపంచకప్‌ ఫైనల్‌లో తలపడేందుకు భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు సిద్ధమయ్యాయి.

Updated : 28 Jun 2024 18:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా వరుస విజయాలతో ఫైనల్‌(T20 World cup 2024 Final)కు దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాతో ఫైనల్‌ పోరు(IND vs SA)కు సిద్ధమైంది. ఈసారి కప్‌ గెలిచి ఐసీసీ ట్రోఫీల సుదీర్ఘ నిరీక్షణకు టీమ్‌ఇండియా(Team India) తెరదించాలని ప్రతీ భారత అభిమాని కోరుకుంటున్నాడు. మరోవైపు తొలిసారి ఫైనల్‌లోకి ప్రవేశించిన దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించాలని చూస్తోంది.

సెమీస్‌ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించిన నేపథ్యంలో.. ఇప్పుడు ఫైనల్‌ మ్యాచ్‌ జరిగే బ్రిడ్జ్‌టౌన్‌ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులపై అందరి దృష్టి నెలకొంది. కరీబియన్‌లో ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఫైనల్‌ రోజు వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. 70 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రిజర్వ్‌డే ఉందా..?

  • వర్షం అంతరాయం కలిగించినా ఫైనల్‌ మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే రిజర్వ్‌డేను కేటాయించారు. శనివారం మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాకపోతే.. మ్యాచ్‌ ఆదివారానికి వెళ్తుంది.
  • శని, ఆదివారాలు వర్షం ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో.. ఆట నిర్వహణ కోసం 190 నిమిషాల అదనపు సమయాన్నీ రెండు రోజులకు కేటాయించారు.

మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాకపోతే..

వర్షం కారణంగా రిజర్వ్‌డే నాడూ మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాకాపోతే.. భారత్‌, దక్షిణాఫ్రికాలను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని